Site icon HashtagU Telugu

Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ

Sea Color Change In Andhra Pradesh Coast

Sea Color : ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని సముద్ర జలాల రంగులు మారుతున్నాయి.. ఇలా ఎందుకు జరుగుతోంది ? కారణం ఏమిటి ? అనేది ఈ కథనంలో  తెలుసుకుందాం..

Also Read :Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి అద్దె ఇంట్లోకి షారుఖ్.. ఎందుకో తెలుసా ?

గతేడాది విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్ర జలం ఎరుపు రంగులో కనిపించింది.

ఇటీవలే పెదజాలరిపేటలో సముద్ర జలం పసుపు రంగులో కనిపించింది.

తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సముద్ర జలం ఆకుపచ్చ రంగులో కనిపించింది.

కొన్ని చోట్ల సముద్రంలో 10 నుంచి 100 మీటర్లు మేర, కొన్ని సార్లు ఇంకా చిన్నఏరియాలో రంగు మార్పు కనిపిస్తోంది. 

రాష్ట్రంలో పలుచోట్ల సముద్ర తీరంలోని ఇసుక కూడా వివిధ రంగుల్లో సందర్శకులను కనిపిస్తోంది. 

ఇలా సముద్రం ఎందుకు రంగులు మారుతోంది ? అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆసక్తి నెలకొంది.  

Also Read :Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ

ఖనిజ ధాతువుల ఎఫెక్ట్ పెద్దదే

సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి  కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు. నదుల నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. నదీ జలాల్లో ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. వాటి స్వభావాన్ని బట్టి సముద్రంలోని నీళ్ల రంగులో మార్పులు జరుగుతుంటాయని సైంటిస్టులు అంటున్నారు. ప్రత్యేకించి కొండ ప్రాంతాల నుంచి వచ్చే నదీజలాల్లో ఎక్కువగా ఖనిజ ధాతువులు ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండే నీటి ప్రవాహాలు సముద్రంలో కలిస్తే సముద్రం ఎర్రగా మారుతుంది. భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్న మట్టిలో హెమటైట్‌లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువ. అది ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిస్తే, సముద్రపు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ ఎరుపు రంగు క్రమంగా గోధుమరంగులోకి, ఆ తర్వాత లేత నీలి రంగులోకి మారిపోతుంది.

వ్యర్థ పదార్థాలు కలిస్తే ఈ రంగులోకి 

వ్యర్థ పదార్థాలతో కూడిన నదీ జలాలు సముద్రంలో కలిస్తే సముద్రపు నీరు లేత ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారుతుంది. పెదజాలరిపేటలో ఇదే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నదీ జలాల ద్వారా భార ఖనిజాలు వచ్చి సముద్రంలో కలిస్తే సముద్ర జలాలు నలుపురంగులో ఉన్నట్లు కనిపిస్తాయి. స్థానికంగా జరిగిన ఒక చర్య వల్ల ఈవిధమైన మార్పు  స్థానికులకు కనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆ రంగు సముద్రం నీటిలో కలిసిపోయి, సముద్రం మళ్లీ సాధారణ రంగులోకి వచ్చేస్తుంది.

ఇసుక రంగుకు ఏమైంది ? 

సముద్రతీరంలోని ఇసుక గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఇది కొన్నిసార్లు నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తుంది. వాస్తవానికి ఇసుక రంగు అనేది మారదు. కానీ వివిధ రకాల రంగుల్లో ఇసుక ఉంటుంది. కొంత ఇసుక నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. దీనికి కారణం అందులోని ఆయా  రంగుల ఖనిజ ధాతువులే. సముద్ర తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలున్నా, గనులున్నా తీరంలోని ఇసుక కూడా ఆ రంగులోనే ఉంటుంది. విశాఖ సముద్ర తీరం పొడవునా ఖనిజ ధాతువులు ఉన్నాయి. అందుకే ఆ నీటి రంగులు మారుతుంటాయి.