అమరావతి రీ లాంఛ్ (Amaravati Relaunch) వేడుకను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రధాని మోదీ (PM Modi) శంకుస్థాపన చేసి, అమరావతి భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాత్రం ఈ సభకు హాజరుకాలేదు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని మోదీతో చిరంజీవికి ఏర్పడిన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన వస్తారని అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
GT vs SRH: హైదరాబాద్‌పై గుజరాత్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!
చిరంజీవి గైర్హాజరుకు సంబంధించి కారణాలపై రాజకీయ వర్గాల్లో వాదనలు మొదలయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి సమర్థించడమూ, అమరావతి భూసేకరణపై ఆయన విపరీతమైన విమర్శలు చేయడం నేటి సందర్భంలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి అమరావతి వేడుకకు రావడం వల్ల భిన్నమైన రాజకీయ సందేశాలు వెళతాయని భావించి, ఆయన స్వయంగా దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయన ఈ సభపై సోషల్ మీడియాలో కూడా ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం చర్చకు దారితీసింది.
కానీ చిరంజీవి రాకపోవడానికి కారణం ముంబైలో వేవ్స్ సదస్సులో పాల్గొన్నారని సమాచారం. ఇది ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్ కావచ్చునన్న భావన కూడా ఉంది. రాజకీయంగా తాను ఇక యాక్టివ్‌గా ఉండబోనని గతంలో చెప్పిన చిరంజీవి, ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మాత్రమే మద్దతుగా ఉన్నారు. అయినా, చంద్రబాబు, మోదీ వంటి నేతలతో మెగాస్టార్ కలిసి కనిపించిన సందర్భాలు ఇటీవల ఎక్కువ కావడం వల్ల, ఆయన గైర్హాజరుకు మరింత చర్చ మొదలైంది. ఏది ఏమైనప్పటికి చిరంజీవి వస్తే వేడుకకు మరింత అందం వచ్చేదని అంత మాట్లాడుకుంటున్నారు.