Prashant Kishor – IPAC : ఐప్యాక్.. ప్రశాంత్ కిషోర్.. ఏపీలో పొలిటికల్ హీట్

Prashant Kishor - IPAC : గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 11:28 AM IST

Prashant Kishor – IPAC : గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సాయం చేసే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ  (ఐ ప్యాక్) సంస్థను ప్రశాంత్ కిషోరే స్థాపించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినప్పటికీ తాము వైసీపీ కోసమే పని చేస్తున్నామని పేర్కొంటూ ఐ ప్యాక్ ఒక ట్వీట్ చేసింది. అయితే ప్రశాంత్ కిషోర్‌తో తమకు సంబంధం లేదని మాత్రం చెప్పలేదు. అసలు ట్విస్ట్ ఇదేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతానికి ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి చూస్తున్నారు. ఇప్పుడు ఈయన ఆఫీసు తాడేపల్లిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సీఎం క్యాంప్ ఆఫీసులోనే రిషిరాజ్ ఉంటారు. ఈ లెక్కన ప్రశాంత్ కిషోర్ కోసం ప్రత్యేక టీమ్స్ ఏపీలో పనిచేేస్తున్నాయని తేటతెల్లమైంది. కొంతకాలంగా అంతర్గతంగా పీకే టీమ్స్ ఏపీలోని పరిస్థితుల్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాయని.. వాటి ఆధారంగానే  అమరావతిలో చంద్రబాబు ఎదుట ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారని అంటున్నారు. దీన్నిబట్టి ప్రస్తుతం ప్రశాంత కిశోర్ స్వతంత్ర పొలిటికల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని స్పష్టమైంది. ఐప్యాక్ అనేది వేరుగా స్వతంత్రంగా పనిచేస్తోంది.

Also Read: Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10

2019 అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పీకేని చూపిస్తూ ‘‘నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు’’ అని  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల ఫలితాలకు ముందు జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీలోనూ పీకేను చూపిస్తూ మనల్ని ఈయనే గెలిపించబోతున్నాడని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చేయి కలిపేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు పీకే టీడీపీ కోసం పని  చేస్తున్నారన్న భావన.. వైసీపీ క్యాడర్‌లోకి నెగెటివ్ సిగ్నల్స్ పంపే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల తర్వాత టీడీపీ కోసం పని చేసేందుకు పీకే ఆసక్తి చూపినా.. .చంద్రబాబు నో చెప్పారని అంటారు. ఆ తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికీ ఐ ప్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసమే పని చేస్తోంది. కానీ కేవలం పీకే(Prashant Kishor – IPAC) మాత్రమే చంద్రబాబుతో చేయి కలిపేందుకు రెడీ అయ్యారు.