Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్లీ రెండు చోట్ల నుండి పోటీ చేయబోతున్నాడా..?

Pawan

pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి రెండు చోట్ల నుండి పోటీ (contest 2 seats) చేయబోతున్నాడా..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే టాపిక్ నడుస్తుంది. జనసేన పార్టీ (Janasena Party) స్థాపించిన దగ్గరి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసింది కేవలం ఒకేసారి అది కూడా గత ఎన్నికల్లో. గత ఎన్నికల్లో సింగిల్ గా జనసేన బరిలోకి దిగింది. సింగిల్ గా బరిలోకి దిగిన జనసేన కేవలం సింగిల్ సీటు మాత్రమే దక్కించుకుంది. ఆ తర్వాత ఆ సింగిల్ వ్యక్తి కూడా వైసీపీ లో జాయిన్ అయ్యారు. రెండు స్థానాల నుండి పోటీ చేసిన పవన్..రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల తో పోలిస్తే రాష్ట్రం (AP) లో జనసేన గ్రాఫ్ పెరిగింది. ఇదే క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన బరిలోకి దిగబోతుంది. రాష్ట్రం వ్యాప్తంగా జనసేన 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుండి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి , అనంతపురం (Pawan Kalyan To Contest From Anantapur) నుండి పవన్ పోటీ చేయనున్నారని అంటున్నారు. మొన్నటి వరకు పవన్ తిరుపతి (Tirupathi) నుండి పోటీ చేయనున్నారని , చంద్రబాబు సూచనా మేరకు పవన్ ఇక్కడి నుండి బరిలోకి దిగబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడేమో అనంతరం నుండి పోటీ చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుత పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం పై బలమైన విశ్లేషణ జరుగుతోంది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 10 వరకు ఉన్నాయి. కానీ పవన్ అనంతపురం నుండే పోటీ చేయనున్నారని అంటున్నారు.

ఒకవేళ పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి (Prabhakar Chaudhari) ఇదివరకే ప్రకటించారు. అనంతపురంలో బలిజ సామాజిక వర్గం అధికం. దాదాపు 70 వేల వరకు ఓటర్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. వారంతా టిడిపి పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. ప్రజారాజ్యంతో పాటు గత ఎన్నికల్లో జనసేనకు సైతం మద్దతు తెలిపారు. పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని.. రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు జనసేన నుంచి అధికారికంగా పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం పై ప్రకటన రాలేదు. అయితే పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయడం ఖాయమని విశ్లేషణలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది. మరి పవన్ తిరుపతి నుండి పోటీ చేస్తారా..? అనంతపురం నుండి చేస్తారా..? లేక రెండు చోట్ల నుండి పోటీ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Sircilla Weavers : పార్టీల జెండాల తయారీకి కేరాఫ్ అడ్రస్ ‘సిరిసిల్ల’.. విశేషాలివీ