Site icon HashtagU Telugu

PK Tweet : పవన్ ‘యుద్ధం ట్వీట్ ‘ప్రకంపన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయని అంటుంటారు. అలాంటిది ఆయన నుంచి కానీ, ఆయన పేరు మీద కానీ ఏది వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇకపోతే, తాజాగా పవన్ కళ్యాణ్ బుధవారం ట్విట్టర్ లో ఓ విషయమై ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

మహాభారతం విషయానికొస్తే… అందులో శిశుపాలుడికి వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు అవకాశం ఇచ్చాడని అంటారు. అలాగే ఇప్పుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తొంభై తొమ్మిది అవకాశాలు ఇస్తానంటున్నారు. దీన్ని బట్టి మనం అర్దం చేసుకోవచ్చు. అదేంటంటే… పవన్ పరోక్షంగా జగన్ సర్కార్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్ చేశారో ఇప్పుడు చూద్దాం..

‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను’ అంటూ పవన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఒకవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై సర్వత్రా విమర్శల వెల్లువ వినిపిస్తోంది. ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలోనూ జగన్ సర్కార్ కావాలనే పవన్ పై పగబట్టిందని… అందుకే బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అవకాశం ఇవ్వలేదని… ఆయన అభిమానులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిని ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారో.. లేదంటే తన మనస్తత్వం ఇదేనని చెప్పాలనుకున్నారో తెలియదు కానీ.. మార్పు కోసం ఇంకా ఎంత కాలమైనా వేచి చూస్తాననే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

ఇటీవల వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాలోనూ సరిగ్గా ఇలాంటి డైలాగే ఒకటుంది. పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన తర్వాత బస్సులో వెళుతున్న ‘భీమ్లా నాయక్‌‌’ ను‌ రెచ్చగొట్టేందుకు ‘డానియల్ శేఖర్’ ప్రయత్నించిన సందర్భంలో.. ‘‘నువ్వు పీకేయ్.. నేను మొలుస్తా. నువ్వు తొక్కేయ్.. నేను లేస్తా. నువ్వు తీసేస్తే.. నేను మళ్లీ వస్తా.. నీకు ఆపలేని యుద్ధం ఇస్తా..’’ నంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా పవన్ చేసిన ట్వీట్ అయితే మాత్రం సందర్భాన్ని బట్టి చూస్తే…. చాలా లోతైన అర్థం వచ్చేలా ఉందని పలువురు భావిస్తున్నారు. ఫైనల్ గా ఈ ట్వీట్ ఇంకా ఎంత చర్చకు తావిస్తుందో అన్నది చూడాలి.

Exit mobile version