IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీగా క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన భారీ బ‌దిలీలుగా భావించొచ్చు.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 04:14 PM IST

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీగా క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన భారీ బ‌దిలీలుగా భావించొచ్చు. పోలీస్ టీమ్ ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికీ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తూ జ‌రిగిన బ‌దిలీలుగా వీటిని కొంద‌రు భావిస్తున్నారు. రాబోవు రోజుల్లో హోదాల వారీగా పెద్ద సంఖ్య‌లో బ‌దిలీలు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ వ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా బ‌దిలీలు చేయ‌డానికి డీజీపీ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి బ‌దిలీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఐజీపీ క్రీడలు, సంక్షేమంగా ఎల్ కేవీ రంగారావు, రైల్వే ఏడీజీగానూ అదనపు బాద్యతలు
ఎస్వీ రాజశేఖర్ బాబు ఆక్టోపస్ డీఐజీగా బదిలీ , డీఐజీ శాంతిభద్రతలుగా అదనపు బాధ్యతలు
పీహెచ్ డి రామకృష్ణ ను ఏసీబీ డీఐజీగా బదిలీ , టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాద్యతలు
కేవీ మోహన్ రావు పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా బదిలీ
ఎస్ .హరికృష్ణ ను కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా అదనపు బాద్యతలు
గోపీనాథ్ జెట్టి , గ్రేహౌండ్స్ డీఐజీగా బదిలీ , న్యాయవ్యవహారాల ఐజీపీగా అదనపు బాధ్యతలు
కోయప్రవీణ్ ను 16 బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ
డి ఉదయబాస్కర్ ను పోలీసు హెడ్క్వార్టర్లకు రిపోర్టు చేయాలని ఆదేశాలు
విశాల్ గున్నీ కి విజయవాడ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు
కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్ గానూ అదనపు బాధ్యతలు
అజితా వేజేండ్ల గుంతకల్ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు
పి. అనిల్ బాబు ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ
జి.కృష్ణకాంత్ రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్ గా బదిలీ
పి.జగదీశ్ ను చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ
డి.ఎన్ .మహేష్ ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ
తుహిన్ సిన్హా పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీ
బిందుబాధవ్ గరికపాటిని పలనాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ
పీవీ రవికుమార్ ను విజిలెన్సు , ఎన్ ఫోర్సుమెంట్ ఎస్పీగా బదిలీ