ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి (Jagan) మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని పూర్తిగా మార్చారు. ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపట్టింది. కానీ ఇందులో భారీ అవినీతి, ముడుపులు కొనసాగాయి. కల్తీ మద్యం వల్ల 30 వేల మందికి పైగా మృతి చెందగా, లక్షలాది మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. పైగా కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారు. విచారణలో తేలిన ఆధారాల ప్రకారం.. ఈ స్కాం విలువ రూ.3,500 కోట్లుగా అంచనా.
ఈ స్కాంలో ముఖ్య పాత్రధారులుగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజ్ కెసిరెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అధికారులైన వాసుదేవ్ రెడ్డి, డి. సత్యప్రసాద్ వంటి వారికీ ముడుపులు అందినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించడం, ఎస్పీవై ఆగ్రో సంస్థకు అరబిందో గ్రూప్ ద్వారా రుణాలు ఏర్పాటు చేయడం వంటి వివిధ మార్గాల్లో భారీగా నల్లధనాన్ని కూడబెట్టినట్లు సమాచారం. PLR ప్రాజెక్ట్స్, ఈడీ క్రియేషన్స్, స్థిరాస్తి కంపెనీల ద్వారా ఈ సొమ్ము వెనకుగా లబ్ధిదారులకు చేరినట్లు చెబుతున్నారు.
Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్
ఇక మద్యం బ్రాండ్ల విషయంలో తప్పుడు బ్రాండ్లు – ఇమిటేషన్ పేర్లతో నకిలీ మద్యం తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. అసలు బ్రాండ్ల పేర్లను అచ్చంగా అనిపించేలా తక్కువ నాణ్యత మద్యం అమ్మి ఒక్కో కేసుకు రూ.1,000 వరకు అధిక ధర వసూలు చేశారు. బ్యాగ్ పైపర్, బకాడీ, మెక్‌డౌల్స్ లాంటి బ్రాండ్ల పేర్లతో అనుబంధమైన ఇమిటేషన్ బ్రాండ్లను తీసుకురావడం ద్వారా వేల కోట్లు దోచుకున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ఈ కేసులో సిట్ 11 మందిని అరెస్ట్ చేసి, 40 మందిని నిందితులుగా చేర్చింది. 214 మందిని విచారించింది. డబ్బు తరలింపు, హవాలా లావాదేవీలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన విధానం, బెంగళూరులో స్థిరాస్తి కొనుగోళ్లు, డుబాయ్ డెన్ లాంటి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు అమలు చేయడం చూస్తే ఇది దేశం మొత్తం అతిపెద్ద మద్యం కుంభకోణాలలో ఒకటిగా నిలిచింది. ఈ స్కాం అంతిమ లబ్ధిదారుడు ఎవరో, ఆయన రాజకీయ భవితవ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ప్రజల్లో చర్చ మొదలైంది.