Allu Aravind Vs Pawan Kalyan : జ‌న‌సేనానిపై అరవింద్ ప‌రోక్ష వార్‌

స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ ప‌క్కా బిజినెస్ మేన్. ఎవ‌ర్ని ఎక్క‌డ ఎలా వాడాలో అలా వాడేస్తుంటారు. `ఆహా`లో అన్ స్టాప‌బుల్ `షో`కు నంద‌మూరి బాల‌క్రిష్ణ‌ను ఒక రేంజ్ లో ఉప‌యోగించారు. ఇదంతా ఆయ‌న వ్యాపార వ్యూహం

  • Written By:
  • Updated On - May 12, 2022 / 01:47 PM IST

స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ ప‌క్కా బిజినెస్ మేన్. ఎవ‌ర్ని ఎక్క‌డ ఎలా వాడాలో అలా వాడేస్తుంటారు. `ఆహా`లో అన్ స్టాప‌బుల్ `షో`కు నంద‌మూరి బాల‌క్రిష్ణ‌ను ఒక రేంజ్ లో ఉప‌యోగించారు. ఇదంతా ఆయ‌న వ్యాపార వ్యూహం. కానీ, మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య ఏదో తేడా వ‌చ్చింద‌ని ఆ `షో` త‌రువాత టాలీవుడ్ లో టాక్ ఉంది. స్లైలిష్ స్టార్ అర్జున్ `అల్లు` కుటుంబం నుంచి తిరుగులేని హీరోగా ఎదిగారు. టాలీవుడ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న టాప్ హీరో అల్లు అర్జున్. ఆ త‌రువాత మాత్ర‌మే మెగా హీరోలు అంటూ ఇటీవ‌ల ఆర్జీవీ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదంతా అర‌వింద్ బిజినెస్ లోని ఒక గేమ్ అంటూ ఆయ‌న గురించి బాగా తెలిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు చెబుతుంటారు.

తొలి నుంచి ఒక ఛాన‌ల్ కు వ్య‌తిరేకంగా ఉండే అల్లు అర‌వింద్ ఇప్పుడు విష్య‌క్సేన్ కు మ‌ద్ధ‌తు ఇచ్చారు. అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సక్కెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సాధార‌ణంగా ఎలాంటి వ్యాపార‌, ఇత‌ర‌త్రా వ్యూహం లేకుండా ఆయ‌న ఏ ఫంక్ష‌న్ కు హాజ‌రు కార‌ని టాలీవుడ్ కు తెలుసు. కానీ, విష్వ‌క్సేన్ హీరోగా న‌టించిన సినిమా విజ‌యోత్స‌వానికి హాజ‌రు అయ్యారు. అంటే, ఏదో ఒక కొత్త కోణం అల్లు అర‌వింద్ మ‌దిలో ఉంటుంద‌ని భావిస్తున్న వాళ్లు అనేకులు. అంతేకాదు, హీరోలు `ఈగో`ల‌కు పోకుండా క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని `అశోక‌వ‌నంలో అర్జున్ క‌ల్యాణం` విజ‌యోత్స‌వ వేదిక‌పై నుంచి హిత‌వు ప‌లికారు. బాలీవుడ్ ప‌రిస్థితి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు రాకుండా ఉండాలంటే హీరోలు ఐక్యంగా ఉండాల‌ని బాహాటంగా చెప్పారు. ఓటీటీ అనే డేంజ‌ర్ ట్రెండ్ గురించి ప్ర‌స్తావించారు. ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌లేని దుస్థితికి బాలీవుడ్ వెళ్లిన విష‌యాన్ని గుర్తు చేశారు. కొన్ని సినిమాలను మాత్రమే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకునే దుస్థితి బాలీవుడ్ లో ఉంద‌న్న వ్యాఖ్య వెనుక చాలా ఆంత‌ర్యం ఉంది.

తెలుగు సినిమా రంగంలోని టాప్ హీరోల సినిమాలు `హిట్‌-ఫ‌ట్` తో సంబంధం లేకుండా ఇంత‌కాలం పాటు ఓపెనింగ్స్ తో కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టారు. ఇండస్ట్రీలోని ఆ న‌లుగురు చేత‌ల మీద‌గా వ్యాపారం జ‌రిగేది. సినిమా క‌థ‌, క‌థ‌నంతో సంబంధంలేకుండా ప్రేక్ష‌కుల బ‌ల‌హీన‌త నుంచి వ‌సూళ్లు రాబ‌ట్టే వాళ్లు. ఇదంతా జ‌గ‌న్ ఏపీ సీఎం కాక‌ముందు న‌డిచిన వ్య‌వ‌హారం. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది.ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం ఓపెనింగ్స్ మీద ప‌డింది. ఇష్టానుసారంగా ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. ఆన్ లైన్ విధానంలో టిక్కెట్ల‌ను విక్ర‌యించే ప‌రిస్థితికి వ‌చ్చింది. ఏ మాత్రం టాక్స్ నుంచి త‌ప్పించుకోకుండా జ‌గ‌న్ స‌ర్కార్ ప్లాన్ చేసింది. దీంతో తెలుగు సినిమాకు క‌ల్ప‌వృక్షంగా ఉన్న ఏపీ మార్కెట్ ప‌డిపోయింది. దీనంత‌టికీ కార‌ణం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఈగో` కార‌ణమంటూ టాలీవుడ్ లోని కొంద‌రు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. అదే విష‌యాన్ని ప‌రోక్షంగా అల్లు అర‌వింద్ గుర్తు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మస్య వ‌చ్చిన‌ప్పుడు హీరోలు అంద‌రూ ఐక్యంగా జ‌గన్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేక‌పోయారు. ఇండ‌స్ట్రీలోని అనైక్య‌త బ‌య‌ట‌ప‌డింది. ప‌వ‌న్ వ‌ర్సెస్ మిగిలిన హీరోలు అన్న‌ట్టు హైప్ అయింది. ప్ర‌భుత్వాల‌కు, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య సున్నిత‌మైన మైండ్ గేమ్ న‌డుస్తోంది. ఆ విష‌యాన్ని ప‌రోక్షంగా గుర్తు చేసేలా బాలీవుడ్ సినిమాల విడుద‌ల గురించి అల్లు అర‌వింద్ మాట్లాడార‌నిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ స‌ర్కార్ రాక‌ముందు బాలీవుడ్ ప‌రిస్థితి వేరు. అప్ప‌ట్లో సల్మాన్ ఖాన్‌, అమీర్ ఖాన్‌, షారూక్ ఖాన్ బాలీవుడ్ ను ఏలారు. ఆ ముగ్గురు ఖాన్ ల గురించి బీజేసీ స‌ర్కార్ ప‌లు విధాలుగా వ్య‌తిరేక ప్ర‌చారం చేసింది. సీన్ క‌ట్ చేస్తే, ఆ హీరోల సినిమాలపై నిరంత‌ర నిఘా ఉండ‌డంతో ఏదో ఒక కార‌ణంతో విడుద‌లపై ప‌లు ఆంక్ష‌లు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితి టాలీవుడ్ కు రాకుండా ఉండాల‌ని ప‌రోక్షంగా హీరోల మ‌ధ్య ఉన్న `ఈగో` అత్యంత ప్ర‌మాదమ‌ని ప్ర‌స్తావించార‌ని భావించొచ్చు. ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ యాంక‌ర్ ను ఆడుకున్న విష్య‌క్సేన్ సినిమా స‌క్సెస్ మీట్ కు అర‌వింద్ వెళ్ల‌డం ఒక వ్యూహమైతే, టాలీవుడ్ కు పొంచి వున్న ప్ర‌మాద ఘంటిక‌ల‌ను గుర్తు చేస్తూ హీరోల మ‌ధ్య ఉన్న‌ `ఈగో`ల‌ను గుర్తు చేస్తూ ప‌వ‌న్ ను టార్గెట్ చేశార‌న్న‌మాట‌.