Chandrababu Bail : స్కిల్‍ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడుకు ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం

  • Written By:
  • Updated On - October 31, 2023 / 11:18 AM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడుకు ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో బాబుకు బెయిల్ ల‌భించింది. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఆరోగ్య స‌మ‌స్య‌లు దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు చంద్ర‌బాబుకు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.  చంద్ర‌బాబుకు మ‌ధ్యం బెయిల్‌లో హైకోర్టు ష‌ర‌తులు విధించింది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడద‌ని.. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని పేర్కొంది. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల‌ని తెలిపింది. చంద్ర‌బాబుతో ఇద్దరు DSPలు, ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి ఆదేశించారు. Z+ సెక్యూరిటీ విషయంలో.. కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్ర‌బాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో 53 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్ర‌బాబు కి బెయిల్ రావ‌డ‌వ‌తో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తముళ్లు బాణ‌సంచా కాల్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు. సాయంత్రం ఐదు నుంచి ఏడు గంట‌ల ప్రాంతంలో చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చంద్ర‌బాబు త‌న‌కు ఇష్ట‌మెచ్చిన ఆసుప‌త్రిలో చికిత్స పొందొచ్చ‌ని అడ్వకేట్ జీవీఎల్ మూర్తి తెలిపారు. మ‌రో కేసులో కూడా చంద్ర‌బాబుని అరెస్ట్ చేసే అవ‌కాశం కూడా ఉండ‌ద‌ని న్యాయ‌వాదులు తెలిపారు. అయితే చంద్రబాబుపై ప‌లు కేసుల‌ను ఏపీ సీఐడీ న‌మోదు చేసింది. తాజాగా నిన్న మద్యం కంపెనీల‌కు  అనుమ‌తల్లో  కేటాయింపులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని కేసు న‌మోదు చేసింది. విడుద‌ల కాగానే రాజ‌మండ్రి జైలు నుంచి నేరుగా అమ‌రావ‌తికి రోడ్డు మార్గంలో చంద్ర‌బాబు రానున్నారు. రోడ్డు పొడ‌వునా చంద్ర‌బాబుకు అపూర్వ స్వాగ‌తం ప‌లికేందుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సిద్ధ‌మ‌వుతున్నారు. రాజ‌మండ్రి జైలు వ‌ద్ద‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, చంద్ర‌బాబు అభిమానులు పెద్ద సంఖ్య‌లో చేరుకుంటున్నారు. 53 రోజుల త‌రువాత చంద్ర‌బాబును చూసేందుకు అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు.