Nara Brahmani : బ్రాహ్మణి ఇంట్రెస్టింగ్ ట్వీట్..ఆనందంలో పార్టీ శ్రేణులు

Nara Brahmani : "మా జీవితంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది" అంటూ ట్వీట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nara Brahmani Tweet

Nara Brahmani Tweet

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani) చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. “మా జీవితంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది” అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్న ఫోటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి (Chandrababu New House)నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆమె ఈ భావోద్వేగపూరిత ట్వీట్ చేయడం జరిగింది.

అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన

అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఇంటిని నిర్మించబోతున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో, E9 రహదారి పక్కనే ఉన్న ఈ స్థలంలో ఈరోజు బుధువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముందు గత ఏడాది డిసెంబర్‌లో చంద్రబాబు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ స్థలంలో 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి+1 నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతను ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించారు.

Gold Loan Rules: ఇక‌పై బంగారంపై రుణం సులభంగా లభించదా?

చంద్రబాబు నివాసం నిర్మాణం తాత్కాలిక హైకోర్టు, సచివాలయానికి మధ్యలో ఉండడం వల్ల కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. నలుదిక్కులా రహదారులతో ఆ ప్రాంతం అనుసంధానమవడం, అధికారిక వ్యవహారాల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్‌తో పాటు, చంద్రబాబు కుటుంబ సభ్యుల సమూహంలో జరిగిన భూమిపూజ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక పునరుద్ధరణకు నాంది పలికిన ఈ ఘట్టం, పార్టీ కార్యకర్తల్లో అభిమానం మరింత పెంచుతోంది.

  Last Updated: 09 Apr 2025, 04:18 PM IST