Triangle love story: బేబీ సినిమా తరహాలో ఇంటర్ విద్యార్థిని ట్రయాంగిల్ లవ్ స్టొరీ, చివరకు ఏమైందంటే!

బేబీ సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన బాలిక.. చివరికి విషాదాంతం గా మారింది

Published By: HashtagU Telugu Desk
relation

Crime

సినిమాల ప్రభావమో, ఇతర ఆకర్షణలు ఏమో కానీ నేటి విద్యార్థులు టీనేజ్ లో విచ్చలవిడిగా ప్రేమించుకుంటున్నారు. సినిమా చూపించిన మాదిరిగా ఒకరు కాదు, ఇద్దరితో ప్రేమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో బేబీ సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన బాలిక.. చివరికి విషాదాంతం గా మారింది. విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.

ఆ బాలిక సాయికుమార్‌తో రహస్యంగా తాళి కట్టించుకున్న తరువాత కూడా సూర్యప్రకాష్‌తో ప్రేమాయణం నడిపింది. తరువాత పెళ్లి చేసుకున్న వీడియో, సూర్యప్రకాష్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు  బయటికి వచ్చి వైరల్‌గా మారాయి. దీంతో భర్త సాయికుమార్, ప్రియుడు సూర్యప్రకాష్ ఇద్దరూ ఆ బాలిక ఇంటికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అంటూ నిలదీశారు.

మనస్థాపానికి గురైన ఆమె “సూర్య.. వాళ్లు ఎవరినీ వదలకు, కుక్క చావు చావాలి కొడుకులు” అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా భయపడిన సూర్యప్రకాష్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలిక మెడలో తాళి కట్టిన భర్త సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: Dil Raju: బాలీవుడ్ లోకి దిల్ రాజు ఎంట్రీ, షాహిద్ కపూర్ తో భారీ మూవీకి ప్లాన్

  Last Updated: 14 Aug 2023, 02:55 PM IST