Vizag : వైజాగ్‌లో హోట‌ల్స్‌పై విజిలెన్స్ అధికారుల త‌నిఖీలు.. నిల్వ ఉంచిన ఆహారాన్ని..?

వైజాగ్‌లోని హోల‌ళ్ల‌పై విజిలెన్స్ అధికారులు త‌నిఖీ చేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. స్వరూపా రాణి

  • Written By:
  • Updated On - November 29, 2023 / 07:35 AM IST

వైజాగ్‌లోని హోల‌ళ్ల‌పై విజిలెన్స్ అధికారులు త‌నిఖీ చేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. స్వరూపా రాణి నేతృత్వంలోని ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం బృందం నగరంలోని రెండు రెస్టారెంట్‌లపై రైడ్ చేసింది. జగదాంబ జంక్షన్‌లోని హేలపురి, మధురవాడలోని జీషన్ హోట‌ళ్ల‌పై దాడులు నిర్వ‌హించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సంస్థలలోని సిబ్బంది తమ వినియోగదారులకు చికెన్, చేపలు, మటన్‌, బిర్యానీలతో సహా పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేసి ఇస్తున్న‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక విజిలెన్స్ దాడులు జరిగాయి. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల నమూనాలను ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీకి పంపారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. రెండు రెస్టారెంట్లకు 15,000 చొప్పున జరిమానా విధించినట్లు స్వరూపా రాణి తెలిపారు.

Also Read:  Telangana Elections 2023 : రెండు రోజుల పాటు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్