NTR Amit Shah Meet : టీడీపీ స్ట్రాటజీ మిస్సింగ్

తెలుగుదేశం పార్టీ స్టాట‌జీల్లో త‌ప్ప‌ట‌డుగు వేస్తోందా? ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేక‌పోతోంది? ఇదే స‌ర్వ‌త్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట‌. దానికి కారణాలు లేక‌పోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై వ్య‌తిరేక భావాలున్న వాళ్ల‌ను టీడీపీ అక్కున చేర్చుకోవ‌డం ప్ర‌ధాన అంశంగా చెప్పుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - August 22, 2022 / 01:23 PM IST

తెలుగుదేశం పార్టీ స్టాట‌జీల్లో త‌ప్ప‌ట‌డుగు వేస్తోందా? ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేక‌పోతోంది? ఇదే స‌ర్వ‌త్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట‌. దానికి కారణాలు లేక‌పోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై వ్య‌తిరేక భావాలున్న వాళ్ల‌ను టీడీపీ అక్కున చేర్చుకోవ‌డం ప్ర‌ధాన అంశంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఒక విభాగం మీడియా అతి చేష్ట‌లు పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తున్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వీటికి తోడు స‌మ‌యానుకూలంగా మెసేజ్ ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లే స‌మ‌ర్థత ఉన్న నాయ‌కులు మీడియా ముందుకు రాక‌పోవ‌డాన్ని ప్ర‌ధాన కారణంగా భావిస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ గురించి మాట్లాడేందుకు బుద్దా వెంక‌న్న మీడియా ముందుకు రావ‌డం విచిత్రం. ఆయ‌న గ‌తంలోనూ జూనియ‌ర్ మీద వ్య‌తిరేకంగా మాట్లాడి పార్టీకి తెలియ‌ని న‌ష్టాన్ని తెచ్చిపెట్టార‌ని పార్టీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. ఇప్పుడు మ‌ళ్లీ నోవాటెల్ లో జ‌రిగిన భేటీపై `బుద్దా` వ్యాఖ్యానించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. రాజ‌కీయ ప్ర‌స్తావ‌న వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాలేద‌ని ఆయ‌న చెబుతున్నారు. పైగా జూనియ‌ర్ న‌టించిన త్రిబుల్ ఆర్ సినిమాను చూసి లోకేష్ కూడా అభినందిస్తూ ట్వీట్ చేశాడ‌ని గుర్తు చేశారు. అంటే, లోకేష్ త‌ర‌హాలోనే అమిత్ షా కూడా సినిమాను చూసి అభినందించ‌డానికి పిలిచి ఉంటార‌ని `బుద్దా` భావ‌న. అంత‌కు మించి రాజ‌కీయాల గురించి మాట్లాడేందుకు కాద‌ని తేల్చేస్తూ జూనియ‌ర్ పొలిటిక‌ల్ క్రేజ్ ను త‌క్కువ చేసేలా వ్యాఖ్యానించారు.

ఇదే `బుద్దా` గ‌తంలోనూ చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి అసెంబ్లీలో జ‌రిగిన అవ‌మానంపై స్పందించ‌లేద‌ని జూనియ‌ర్ ను కించప‌రిచేలా మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వాడిన ప‌ద‌జాలం పార్టీలోని జూనియ‌ర్ అభిమానుల‌కు ఆగ్ర‌హం క‌లిగించింది. దానికి మ‌రింత ఆజ్యం పోస్తూ ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ గా ఫోక‌స్ అవుతోన్న వ‌ర్ల రామ‌య్య కూడా జూనియ‌ర్ గురించి ఆనాడు విమ‌ర్శిస్తూ మీడియా ముందుకొచ్చారు. ఇవ‌న్నీ చూసిన టీడీపీలోని ఒక గ్రూప్ ఉద్దేశ పూర్వ‌కంగా లోకేష్ టీమ్ జూనియ‌ర్ ను టార్గెట్ చేస్తుంద‌ని భావించారని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ బుద్దా వెంక‌న్న సీన్లోకి వ‌చ్చిన జూనియ‌ర్, అమిత్ షా భేటీ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. ఇక ప‌ట్టాభి టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌దేప‌దే మీడియా ముందుకు వ‌స్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీళ్లెవ‌రూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిచిన లీడ‌ర్లు కాదు. వాళ్ల‌తో జూనియ‌ర్ గురించి మాట్లాడించ‌డం టీడీపీ ఎక్క‌డో స్ట్రాట‌జీ మిస్ అవుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల సోషల్ మీడియా పొలిటిక‌ల్ స్టార్లుగా వెలిగిపోతున్న కొంద‌ర్ని టీడీపీ చేర‌దీసింద‌ట‌. వాళ్ల‌లో ఒక‌రికి ఇటీవ‌ల స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి టీడీపీ నేత‌లు అత‌న్ని ఆకాశానికి ఎత్తారు. స్వ‌త‌హాగా అత‌ను వైసీపీ హార్డ్ కోర్ స్టార్‌. వివిధ కార‌ణాల‌తో ఇప్పుడు ఆ పార్టీని వ్య‌తిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగ‌ని, టీడీపీ సానుభూతిప‌రుడు కాదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండా అత‌న్ని అక్కున చేర్చుకున్నారు. నిక్ ఆఫ్ మూమెంట్లో అత‌ను టీడీపీని ముంచుతాడ‌ని ఆ పార్టీలోని వాళ్లు చెప్పుకుంటున్నారు. ఇక, టీడీపీకి సానుకూలం అనుకుంటోన్న ఛాన‌ళ్ల‌లో ఇద్ద‌రు ప్ర‌జెంట‌ర్లు చేస్తోన్న ఓవ‌రాక్ష‌న్ స‌ర్వేల్లోనూ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ట‌. ఆ ఇద్ద‌రి వాల‌కం కార‌ణంగా టీడీపీలోని వాళ్లే ఏవ‌గించుకుంటున్నార‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ వాళ్ల‌ను న‌మ్ముకుని పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతోంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. పైగా వాళ్లిద్ద‌రూ 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ టిక్కెట్ ను ఆశిస్తూ పావులు క‌దుపుతున్నార‌ని టాక్‌. అందుకే, అవ‌స‌రానికి మించి అస‌హ్యం క‌లిగేలా ప‌లు ఇష్యూల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తూ అతి చేష్ట‌లు చేస్తున్నారు. దీంతో పార్టీకి మేలు కంటే కీడు ఎక్కువ‌గా క‌లుగుతుంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

ఇలాంటి మైన‌స్ పాయింట్ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని టీడీపీ అధిష్టానం ఈసారి అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమాగా ఉంది. కానీ, గ్రౌండ్ లో ప‌రిస్థితి భిన్నంగా ఉన్న విష‌యాన్ని గ్ర‌హించ‌డంలేద‌ని హార్డ్ కోర్ టీడీపీ క్యాడ‌ర్‌ భావిస్తోంది. ప్ర‌జాభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవ‌డానికి ప‌క్కా స్ట్రాట‌జీ లేక‌పోవ‌డం కార‌ణంగా ఇంకా బాలారిష్టాల‌ను ఎదుర్కొంటోంది. అంత‌ర్గ‌త త‌ప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించుకోకుండా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో వెళితే ఈసారి కూడా బూమ్ రాంగ్ అవుతుంద‌ని పార్టీలోని ఒక గ్రూప్ మ‌ద‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికైనా వాస్త‌వాల‌ను టీడీపీ అధిష్టానం గుర్తిస్తుందా? లేదా? అనేది చూడాలి.