పదేళ్ల బాలుడిని అల్లరి చేస్తున్నాడని మేనత్త, మామ కలిసి బాలుడని కూడా చూడకుండా ఇష్టానుసారం అమానుషంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన వైఎస్సార్ జిల్లా కడపలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వైఎస్సార్ జిల్లాలోని ఓంశాంతి నగర్ కు చెందిన భార్యాభర్తలు శివయ్య, భాగ్యమ్మ నెల రోజుల క్రిందట జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ పదేళ్ల కొడుకు అయాన్ ను మేనత్తకు అప్పగించి, జాగ్రత్తగా చూడమని వారి ఇంట్లో వదిలి వెళ్లారు. అయితే, అయాన్ అల్లరి చేస్తున్నాడని, అల్లరి ఆపడానికి, భయపెట్టడానికి మేనత్త ఆ బాలుడిని కొట్టి తొడపై కాల్చింది. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడి పరిస్థితిని గమనించిన బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. విషయం తెలిసిన అయాన్ మేనత్త, మామ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న బాలుడి మేనత్త, మామ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Shocking Incident in Kadapa : కడపలో దారుణం.. బాలుడిని మేనత్త ఇష్టానుసారం కొట్టి….
పదేళ్ల బాలుడిని అల్లరి చేస్తున్నాడని మేనత్త, మామ కలిసి బాలుడని కూడా చూడకుండా ఇష్టానుసారం అమానుషంగా కొట్టారు.

Kadapa Incident
Last Updated: 04 Sep 2022, 01:28 PM IST