Indrakeeladri : ద‌స‌రా ఉత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఇంద్ర‌కీలాద్రి

ద‌స‌రా ఉత్స‌వాల‌కు బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రి ముస్తాబ‌వుతుంది. ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాల కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 03:38 PM IST

ద‌స‌రా ఉత్స‌వాల‌కు బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రి ముస్తాబ‌వుతుంది. ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాల కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు ప్రారంభ‌మైయ్యాయి. అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి 23 వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌లో ఆల‌య అధికారులు నిమ‌గ్న‌మైయ్యారు. దసరా లో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసామ‌ని దుర్గ‌గుడి చైర్మ‌న్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామ‌ని.. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆయ‌న తెలిపారు. అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జ‌రుగుతున్నాయని. తొమ్మిదిరోజుల పాటు రోజుకో అలంకారంలో భ‌క్తుల‌కు అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తార‌ని చైర్మ‌న్ తెలిపారు. అన్ని శాఖల అధికారులతో స‌మ‌న్వ‌యం చేస‌కుంటూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తామ‌ని తెలిపారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మారుస్తున్నామ‌ని తెలిపారు.

ఇటు క్యూలైన్లు వినాయకుడి గుడి వద్ద ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని ఈవో భ్ర‌మ‌రాంభ తెలిపారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని.. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నామ‌న్నారు. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ప్రసాదం కోసం ప‌ది కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఈవో తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని భ‌క్తులు ఇబ్బందిలేకుండా అక్క‌డ కూడా అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని తీసుకోవ‌చ్చ‌ని ఈవో భ్ర‌మ‌రాంభ తెలిపారు. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తామ‌ని.. ద‌స‌రా ఉత్స‌వాల కోసం రూ.7కోట్లు బ‌డ్జెట్ కేటాయించామ‌ని తెలిపారు. దసరా ఉత్స‌వాల తొమ్మిది రోజుల పాటు అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్న‌ట్లు ఈవో తెలిపారు.