Site icon HashtagU Telugu

India’s first Quantum Valley in Amaravati : అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు

Quantum Valley In Amaravati

Quantum Valley In Amaravati

రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగిన తర్వాత, భూముల కేటాయింపులో ప్రభుత్వం స్పష్టత చూపుతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా “క్వాంటం వ్యాలీ” (Quantum Valley)ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. కేవలం దేశీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయంగా కూడ ఇది ఆంధ్రప్రదేశ్‌కు విశేష గుర్తింపు తీసుకురానుంది.

Faria Abdullah : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ కు రెడీ అంటున్న యంగ్ హీరోయిన్

ఇతర ప్రాజెక్టుల పరంగా కూడా అమరావతిలో వేగంగా అభివృద్ధి కొనసాగుతోంది. లా యూనివర్సిటీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలకు తోడు మరో 6 ఎకరాలు మంజూరు చేశారు. అలాగే ఐఆర్‌సీటీసీకి 1 ఎకరం, ఆదాయపు పన్ను శాఖ, రెడ్‌క్రాస్ సొసైటీ, కోస్టల్ బ్యాంక్‌లకు తగిన స్థలాలను కేటాయించారు. ఈ భూముల కేటాయింపుతో రాష్ట్రానికి కీలకమైన కేంద్ర మరియు ప్రైవేట్ సంస్థలు రావడానికి దారితీసింది.

Vijay Devarakonda : ‘కింగ్‌డమ్’ ను టెన్షన్ పెడుతున్న వీరమల్లు

ఇక నివాస భవనాల నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. గెజిటెడ్ అధికారుల కోసం రూ.514 కోట్లతో నివాస భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదనంగా మౌలిక వసతుల కోసం రూ.194 కోట్లు విడుదల చేయనున్నారు. అలాగే 9 టవర్లలో నాన్ గెజిటెడ్ అధికారుల కోసం నివాస ప్రాజెక్టుల నిర్వహణకు రూ.517 కోట్ల టెండర్లు మంజూరు చేశారు. వీటితో పాటు 15 ఓవర్‌హెడ్ ట్యాంకులు, రోడ్డు అనుసంధానాల కోసం మరో రూ.494 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ సమగ్ర చర్యలు అమరావతిని సాంకేతిక, విద్యా, వైద్య, నివాస రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి.