Site icon HashtagU Telugu

IND vs AUS T20 : వైజాగ్‌లో ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్.. వైఎస్ఆర్ స్టేడియం వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన పోలీసులు

Semi Final Scenario

Semi Final Scenario

ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్ కోసం వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపు వైఎస్ఆర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ-20 క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలలో రెండు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. విమానాశ్రయంతో పాటు క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ఏసీపీ స్థాయి అధికారులు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. స్టేడియాన్ని సెక్టార్‌లుగా విభజించి మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, వెలుపల భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్ వ‌ల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ ప్లాన్‌ చేశారు. మ్యాచ్‌కు హాజరయ్యే ప్రేక్షకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి కలర్ జిరాక్స్ టిక్కెట్లను కొనుగోలు చేయవద్దని, అవి నకిలీ టికెట్లు అని పోలీసులు తెలిపారు. బయటి తినుబండారాలు, వాట‌ర్ బాటిళ్ల‌రు స్టేడియంలోకి అనుమతించబోమని, స్టేడియం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ఆటగాళ్లతో సెల్ఫీలు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చ‌రించారు.

We’re now on WhatsApp. Click to Join.

మ్యాచ్‌కి వ‌చ్చే వారికి పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌కు 28 వేల మంది హాజరవుతారని అంచనా వేయగా, అందుకు అనుగుణంగా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌కు హాజరుకాని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, క్రికెట్ స్టేడియం వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి వచ్చే వాణిజ్య వాహనాలు నిర్దిష్ట మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఈ ప్రాంతాల నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు నిర్దిష్ట మార్గాల్లో వెళ్లాలని సూచించారు. నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలకు కూడా పోలీసులు ట్రాఫిక్ అడ్వ‌జ‌రీ జారీ చేశారు.

Also Read:  Whats Today : బీజేపీకి మద్దతుగా మందకృష్ణ ప్రచారం.. సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం