India Today Survey : సింహం సింగిల్!అధికారం చంద్ర‌బాబుదే.!

India Today Survey : తెలుగుదేశం ఒంటరిగా వెళితే అధికారంలోకి రాదా ? ఎందుకు జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కోసం ఆ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తుంది?

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 04:53 PM IST

India Today Survey : తెలుగుదేశం పార్టీకి పొత్తు అవ‌స‌ర‌మా? ఒంటరిగా వెళితే అధికారంలోకి రాదా ? ఎందుకు జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కోసం ఆ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తుంది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇండియా టుడే స‌ర్వే స్ప‌ష్ట‌తను ఇచ్చింది. ఒంట‌రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేసింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు జ‌రిగితే, తెలుగుదేశం పార్టీ 15 మంది ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. అంటే, ఇటీవ‌ల లీకైన ఐ ప్యాక్ స‌ర్వేకు స‌మానంగా ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంటుంద‌న్న‌మాట‌. అంటే, 105 నుంచి 110 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీ గెలుచుకోనుంది. ఆ విష‌యాన్ని జాతీయ స‌ర్వేల‌తో పాటు లీకైన ఐ ప్యాక్ స‌ర్వే కూడా చెబుతోంది.

105 నుంచి 110 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీ గెలుచుకోనుంది (India Today Survey)

వాస్తవంగా బీజేపీ, జ‌న‌సేన పార్టీకి ఏ మాత్రం ఏపీలో ఆద‌ర‌ణ లేదని గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా చెప్పొచ్చు. ఆ రెండు పార్టీలు క‌లిసి పోటీచేసిన‌ప్ప‌టికీ తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రాలేదు. ఆ త‌రువాత బ‌ద్వేల్, ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి దారుణ ప‌రాభ‌వం జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ బ‌హిష్క‌రించిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూపిస్తూ జ‌న‌సేన బ‌ల‌ప‌డింద‌ని భావిస్తోంది. కానీ, గ్రౌండ్లో ఆ రెండు పార్టీల‌కు ఏ మాత్రం ఉనికి లేద‌ని ఇండియా టుడే తాజాగా వెల్ల‌డించిన స‌ర్వేల ద్వారా స్ప‌ష్ట‌మవుతోంది. కేవ‌లం టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌నే పోటీ ఉంటుంద‌ని స‌ర్వే (India Today Survey)తేల్చేసింది.

టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌నే పోటీ ఉంటుంద‌ని స‌ర్వే

జాతీయ మీడియా ఇండియా టుడే  (India Today Survey)ప్ర‌క‌టించిన తాజా స‌ర్వే ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఆ స‌ర్వే ప్ర‌కారం ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జ‌రిగితే మొత్తం 25 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 15 ఎంపీల‌ను గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. ఏడు స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా ఉండ‌గా, మూడు చోట్ల నువ్వా? నేనా? అనే విధంగా పోటీ ఉంటుంద‌ని చెబుతోంది. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ఇలాంటి స‌ర్వేను ఆ సంస్థ చేస్తోంది. జ‌న‌వ‌రిలో చేసిన స‌ర్వే ప్ర‌కారం టీడీపీ 7 నుంచి 10 స్థానాల‌ను గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. కానీ, ఆగ‌స్ట్ వ‌ర‌కు చేసిన తాజా స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం ఒంట‌రిగా  టీడీపీ 15 MP స్థానాల్లో గెలుస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రో ఆరు నెల‌ల త‌రువాత 25 స్థానాల్లోనూ టీడీపీ గెలిచే దిశ‌గా దూసుకెళుతుంద‌ని ఈ స‌ర్వే చూసిన త‌రువాత చంద్ర‌బాబు అంచ‌నా వేయ‌డం టీడీపీ క్యాడ‌ర్ లో ఫుల్ జోష్ నింపుతోంది.

టీడీపీ 15 MP స్థానాల్లో గెలుస్తుంద‌ని స్ప‌ష్టం

ఏ రాష్ట్రాంలోనూ లేనివిధంగా భిన్నమైన‌ స‌ర్వే  (India Today Survey)అంచ‌నాలు ఏపీలో రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక్కో సంస్థ‌కు ఒక్కో విధంగా ఆ రాష్ట్ర ప‌బ్లిక్ ప‌ల్స్ క‌నిపించ‌డం విచిత్రం. ఇటీవ‌ల జాతీయ మీడియా టైమ్స్ నౌ చేసిన స‌ర్వేలో వైసీపీకి 25 ఎంపీల‌కుగాను 24 వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. ఆ ఫ‌లితాల‌ను చూసి ఆ పార్టీ శ్రేణులు సైతం విస్మ‌యానికి గుర‌య్యారు. ఆ సంస్థ జ‌న‌వ‌రిలో విడుదల చేసిన స‌ర్వే ప్ర‌కారం 25 లోక్ స‌భ స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని తేల్చింది. వారం రోజుల క్రితం విడుద‌ల చేసిన మ‌రో స‌ర్వేలో 25 స్థానాల‌కుగాను, 24 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని, కేవ‌లం ఒక చోట మాత్రమే టీడీపీ గెలుస్తుంద‌ని అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : TDP Poll Management : కుటుంబ సార‌థులు వ‌చ్చేస్తున్నారు.!కాస్కోండిక‌!!

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ 50శాతం ఓటు బ్యాంకును సాధించ‌డం ద్వారా 151 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జారంజ‌క పాల‌న కొన‌సాగిస్తున్నంద‌న ఈసారి 51.3% ఓట్ల శాతాన్ని సాధిస్తుంద‌ని టైమ్స్ నౌ అంచ‌నా వేసింది.అంటే, 2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే 1.5% అద‌నంగా ఓటు బ్యాంకు ఉంటుంద‌ని తేల్చింది. క్షేత్ర‌స్థాయిలో క‌ళ్ల‌కు క‌ట్టిన వ్య‌తిరేక క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ స‌ర్వే రూపంలో టైమ్స్ నౌ చూపించిన ఫిగ‌ర్స్ న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని స‌ర్వ‌త్రా వినిపించింది. అంతేకాదు, ఆ సంస్థ వైసీపీ నుంచి తీసుకున్న ముడుపుల వ్య‌వ‌హారాన్ని టీడీపీ ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది.

ఐ ప్యాక్ చేసిన స‌ర్వే ఫిగ‌ర్స్ ఇటీవ‌ల లీకై సోషల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ (India Today Survey)

వాస్త‌వ ప‌రిస్థితుల మీద సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు ర‌కాల స‌ర్వేల‌ను చేయిస్తున్నారు. ఐ ప్యాక్ చేసిన స‌ర్వే ఫిగ‌ర్స్ ఇటీవ‌ల లీకై సోషల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయ్యాయి. వాటికి స‌మాంత‌రంగా ఇప్పుడు ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాలు ఉన్నాయి. ఇక రాష్ట్ర నిఘా వ‌ర్గాలు, సొంత పార్టీలోని న‌మ్మ‌క‌మైన లీడ‌ర్ల ద్వారా చేసిన స‌ర్వేల‌ను క్రోడీక‌రించిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఆ స‌ర్వేల‌ను బేస్ చేసుకుని త్వ‌ర‌లోనే స‌మీక్ష స‌మావేశాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్ల‌తో పెట్ట‌బోతున్నారు. గ్రాఫ్ ప‌డిపోయిన వాళ్ల‌ను నిర్మొహ‌మాటంగా ప‌క్క‌న పెట్టే ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలిపించుకునే ప‌రిస్థితి ఉంద‌ని ఐ ప్యాక్ లీకైన ఫిగ‌ర్స్, ఇండియా టుడే (India Today Survey) వెల్ల‌డించిన స‌ర్వేల ప్ర‌కారం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత మందిని తొల‌గిస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

రాహుల్ గ్రాఫ్ 13శాతం నుంచి 24శాతంకు పెరిగింద‌ని

గ‌త ఆరు నెల‌ల్లోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకత వ‌చ్చింద‌ని ఇండియా టుడే స‌ర్వే సారాంశం. అదే స‌మ‌యంలో కేంద్రంలోనూ మోడీ గ్రాఫ్ 72శాతం నుంచి 63కు ప‌డిపోయింది. మూడోసారి పీఎంగా న‌రేంద్ర మోడీ అవుతార‌ని అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ గ్రాఫ్ డౌన్ ఫాల్ లో ఉంద‌ని తేల్చింది. ఇదే స‌మ‌యంలో రాహుల్ గ్రాఫ్ 13శాతం నుంచి 24శాతంకు పెరిగింద‌ని అంచ‌నా వేసింది. ఎన్డీయే 306 సీట్లతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వే (India Today Survey) చెబుతోంది. అదే, ఇటీవ‌ల ఏర్ప‌డిన ఇండియా కూటమి 193 సీట్లకు పరిమితం కానుంద‌ని అంచ‌నా వేసింది. ఇత‌ర పార్టీలు 44 స్థానాలను కైవ‌సం చేసుకుంటాయ‌ని తేల్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చేసిన స‌ర్వే ప్ర‌కారం ఎన్డీయేకు 298 స్థానాలు, ఇతరులకు 92 స్థానాలు, ఇండియా కూటమికి 153 స్థానాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. అయితే, ఈసారి ఇత‌రుల‌కు త‌గ్గ‌డం ద్వారా ఇండియా కూట‌మికి పెరిగాయ‌ని చెబుతోంది.

Also Read : Atmasakshi Survey: ఆత్మసాక్షి సంచలన సర్వే, సగం కాబినెట్ ఓటమి, అధికారంలోకి టీడీపీ

గ‌త ఎన్నిక‌ల్లో ఓటు షేర్ ప్ర‌కారం అయితే, ఎన్డీయే 43 శాతం, ఇండియా కూటమికి 41 శాతం ల‌భించ‌నుంది. అంటే, రెండు శాతం మాత్ర‌మే కూట‌ముల మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. ఈసారి కాంగ్రెస్ సొంతంగా 182 స్థానాలు గెల్చుకునే అవకాశ ఉంద‌ని తేల్చింది. అదే బీజేపీ 287 స్థానాలు గెలుచుకోవ‌డం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని అంచ‌నా. ఇతరులు 74 సీట్లు గెలుచుకుంటార‌ని ఇండియా టుడే స‌ర్వేలోని సారాంశం. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం మూడోసారి ఏర్ప‌డుతుంద‌ని స‌ర్వేల‌న్నీ ఒకేలా చెబుతున్నాయి. కానీ, ఏపీ విష‌యంలో మాత్రం టైమ్స్ నౌ స‌ర్వేకు భిన్నంగా ఇండియాటుడే స‌ర్వే ఉండ‌డం ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.