INS Arighat : పొరుగుదేశం చైనాలోని అన్ని ప్రధాన నగరాలను కవర్ చేసేంత కెపాసిటీ కలిగిన ‘కే4’ బాలిస్టిక్ క్షిపణిని భారత్ పరీక్షించింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను తొలిసారిగా ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ అనే అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరంలో భారత నౌకాదళం ఈ ప్రయోగ పరీక్ష నిర్వహించింది. 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ ‘కే4’(INS Arighat) బాలిస్టిక్ క్షిపణికి ఉంది. ప్రస్తుతం భారత నౌకాదళం, రక్షణ రంగ విభాగాలు ఈ ప్రయోగం ఫలితాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. మిస్సైల్ ఎంత దూరం ప్రయాణించింది ? ఎంత వేగంతో ప్రయాణించింది ? నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుందా ? అనే అంశాలను బేరీజు వేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. తదుపరిగా దీనిపై రక్షణ శాఖ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read :Delhi Blast : ఢిల్లీలో అలజడి.. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు
ఏమిటీ ఐఎన్‌ఎస్ అరిఘాత్ ?
ఐఎన్‌ఎస్ అరిఘాత్.. ఒక అణు జలాంతర్గామి. ఇది అణుశక్తితో పనిచేయగలదు. దీని నుంచి ఏకంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ తరహా కెపాసిటీ కలిగిన అణు జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ లిస్టులో ఆరో దేశంగా ఇండియా చేరింది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి కె-15, కె-4 రకాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాలని భారత్ నిర్ణయించింది. ఈ మిస్సైళ్లు మన దేశంలో తయారవుతాయి. ఇవి గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగలవు. చైనాలోని ప్రధాన నగరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మిస్సైళ్లను భారత్ రెడీ చేసింది.
Also Read :Rs 7300 Crore Fine : ఎనిమిది కార్ల కంపెనీలపై రూ.7,300 కోట్ల పెనాల్టీ.. ఎందుకు ?
ఐఎన్‌ఎస్ అరిఘాత్ అణు జలాంతర్గామిని మన విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ఉన్న ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో నిర్మించారు. 2011 డిసెంబరు నుంచి కొన్నేళ్ల పాటు దీని నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. ఎట్టకేలకు 2017 నవంబరు 19న ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను జలప్రవేశం చేయించారు. తదుపరిగా దాని పనితీరును టెస్ట్ చేస్తూ.. అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ ఏర్పాటు వంటివన్నీ చేశారు. చివరగా ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లోని ఆయుధాలను తీసుకెళ్లే కెపాసిటీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. రెండు నెలల కిందటే దీన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు.