Site icon HashtagU Telugu

Nuclear Missile : మిస్సైళ్లు సంధించే సబ్ మెరైన్.. వైజాగ్‌లో ఆవిష్కరించిన నౌకాదళం

India Nuclear Missile Submarine Visakhapatnam

Nuclear Missile : అణుశక్తితో సుదీర్ఘ కాలం పాటు నడిచే జలాంతర్గాముల (న్యూక్లియర్ సబ్ మెరైన్స్) తయారీ దిశగా భారత్ మరో ముందడుగు వేసింది.  ఇప్పటికే భారత సైన్యం అమ్ములపొదిలో మూడు న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్లు ఉన్నాయి. సముద్రంలో చడీచప్పుడు లేకుండా సీక్రెట్‌గా ప్రయాణించే ఈ న్యూక్లియర్ జలాంతర్గాముల నుంచి బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా  ప్రయోగించవచ్చు.  ఈ తరహాకు చెందిన నాలుగో న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్‌ కూడా భారత్‌కు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో భారత నౌకాదళం ఆవిష్కరించింది. ‘ఎస్4’ అనే కోడ్ నేమ్ కలిగిన ఈ సబ్ మెరైన్ నుంచి  బాలిస్టిక్‌ క్షిపణులను కూడా శత్రువుల లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు.  టెక్నికల్‌గా ఈ తరహా సబ్ మెరైన్లను ‘ఎస్‌ఎస్‌బీఎన్‌’ అని పిలుస్తుంటారు.

Also Read :Lawrence Bishnoi : లారెన్స్‌ బిష్ణోయ్‌‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. రూ.1.11 కోట్ల రివార్డు : క్షత్రియ కర్ణి సేన

న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్‌‌ విశేషాలు

నాలుగో న్యూక్లియర్ మిస్సైల్ సబ్ మెరైన్‌‌లోని ఫీచర్ల విషయానికి వస్తే.. దీని తయారీకి వాడిన విడిభాగాల్లో దాదాపు 75 శాతం మన దేశంలో తయారైనవే. ఇందులో అమర్చే న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైళ్ల పేరు ‘కే-4’. ఇవి దాదాపు 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు.  ఈ సబ్ మెరైన్‌లో నిలువుగా అమర్చి ఉండే పైపుల నుంచి మిస్సైళ్లను బయటికి ప్రయోగిస్తారు. సముద్రంలో నుంచే ఇదంతా జరుగుతుంది. ఇటీవలే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో వెరీ లో ఫ్రీక్వెన్సీ నావల్ స్టేషన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ స్టేషన్ నుంచి భారత నౌకాదళానికి కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్ అందుతాయి.

Also Read :Seoul Special : మూసీకి మహర్దశ.. సియోల్‌లోని ‘చుంగేచాన్‌’ రివర్ ఫ్రంట్ విశేషాలివీ

ఇండో-పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా(Nuclear Missile) దూకుడుగా ముందుకు పోతోంది. ఈ దూకుడు వల్ల జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ లాంటి చాలా దేశాలు ఇబ్బందిగా ఫీలవుతున్నాయి. భవిష్యత్తులో అక్కడ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు  మన దేశ భద్రత అవసరాల కోసం ఈ న్యూక్లియర్ సబ్ మెరైన్లను వ్యూహాత్మకంగా వినియోగించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తన మిత్రదేశాలకు భారత్ సైనిక సహాయ సహకారాలను అందించే అవకాశం కూడా ఉంది. ఇటీవలే ఆసియాన్ దేశాల సదస్సులోనూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇదే విషయాన్ని చెప్పారు. సైనికపరంగా ఆసియాన్ దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన అన్నారు.