Income Certificate : ఇకపై ఇన్కమ్ సర్టిఫికెట్ అక్కర్లేదు!

Income Certificate : ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
New Aarogyasri Card distribution in ap

telangana high court notice to cm jagan

Income Certificate : ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అడగకూడదని పేర్కొంటూ మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్ వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అడగడానికి బదులుగా అప్లై చేసిన మూడు రోజులలోగా ఆయా శాఖలు.. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి సర్టిఫికెట్లను తెప్పించుకుంటే సరిపోతుందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్నందున.. ఆ ధ్రువీకరణ ఆధారంగా జారీ అయ్యే సర్టిఫికెట్లను ఆదాయ ధ్రువపత్రాల స్థానంలో స్వీకరించాలని డిసైడ్ చేశామంటూ ఏపీ రెవెన్యూ శాఖ ఒక జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం.. పోస్ట్‌ మెట్రిక్యులేషన్‌ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join

ఒక వ్యక్తికి ఉన్న భూమి ఎంత ? మున్సిపల్‌ ఆస్తి ఎంత ? 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు ఏమిటి ? వారు విని­యోగించే విద్యుత్‌ యూనిట్లు ఎన్ని ? అనే అంశాల ఆధారంగా ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీన్ని రియల్‌ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్‌ సర్వీసుల సాఫ్ట్‌వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఏపీ సర్కారు ఆర్డర్స్ జారీ చేసింది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ (Income Certificate) జారీ చేస్తుంది.

Also read : Yashasvi Jaiswal: ఆసియా క్రీడలలో యశస్వి జైస్వాల్ సెంచరీ.. 48 బంతుల్లోనే 100 పరుగులు..!

  Last Updated: 03 Oct 2023, 09:09 AM IST