TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్‌ కీలక ఆరోపణల

గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

Published By: HashtagU Telugu Desk
In TTD Rs. 100 crore corruption: Chinta Mohan's key allegations

In TTD Rs. 100 crore corruption: Chinta Mohan's key allegations

TTD: గత వైసీపీ (YCP) పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)(Tirumala Tirupati Devasthanam)లో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌(Chinta Mohan) ఆరోపించారు. 6 నెలల క్రితం రూ.100 కోట్లు చేతులు మారాయని ఆయన అన్నారు. గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక సత్రాల కోసం రూ.1200 కోట్లకు ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. కానుకల రూపంలో భక్తులు సమర్పించిన హుండీ సొమ్మును అపవిత్రం చేశారని.. ఈ సొమ్మును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో గతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. వరుస ఘటనలపై టీటీడీ దే ఈవో విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్‌ చేశారు.

కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుసగా వచ్చిన సెలవుల కారణంగా తిరుమలకి భక్తుల తాకిడి పెరిగింది. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం, శుక్రవారం శ్రావణ శుక్రవారం, సాఫ్ట్‌వేర్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం , ఆదివారం సెలువు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి అతిథి గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గ‌రుడ వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అర్చకులు వెల్లడించారు.

Read Also: Doctor Rape Case: దయచేసి విధుల్లోకి రండి, వైద్యులకు పొన్నం రిక్వెస్ట్

 

  Last Updated: 18 Aug 2024, 02:47 PM IST