Site icon HashtagU Telugu

Tomato 1 Rupee : అక్కడ కిలో టమాటా 1 రూపాయే.. రైతుల లబోదిబో

Tomato Prices Rise

Tomato Prices Rise

Tomato 1 Rupee : టమాటా ధరలు గతంలో ఎంతగా పెరిగాయో.. ఇప్పుడు అంతగా తగ్గిపోయాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం కిలో టమాటా రిటైల్ ధర రూ.20 దాకా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా ధర నాణ్యతను బట్టి రూ.20 నుంచి రూ.25 దాకా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ లో కిలో  టమాటా 1 రూపాయి కంటే తక్కువ రేటే పలుకుతోంది. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్ యార్డులో 50 కిలోల టమాటా బాక్స్ ధర ఎంతో తెలుసా ? కేవలం 50 రూపాయలు. దీంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు టమాటాలను రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తికొండ మార్కెట్ కు వచ్చే టమాటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పత్తికొండ మార్కెట్ లో టమాటాలను కొని ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ధర ఎక్కువగా ఉన్నచోట్ల విక్రయించేలా ప్రణాళికలను  రాష్ట్ర సర్కారు అమలు చేయాలని రైతులు సంఘాలు కోరుతున్నాయి. ఒక్క టమాటా కోసమే కాకుండా.. ఇతర పంటలకు కూడా ఈ తరహా వ్యూహాన్ని అనుసరిస్తే ధరలు బాగా తగ్గినప్పుడు రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని అంటున్నాయి.