AP – Trains Cancelled : రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో ఈ రైళ్లు రద్దు

AP - Trains Cancelled : విజయవాడ డివిజన్‌ బాపట్ల స్టేషన్‌ దగ్గర మూడో లైను, నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 10:53 AM IST

AP – Trains Cancelled : విజయవాడ డివిజన్‌ బాపట్ల స్టేషన్‌ దగ్గర మూడో లైను, నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. భువనేశ్వర్‌-తిరుపతి (02809) ప్రత్యేక రైలును ఈనెల 30న, అక్టోబరు 7న.. తిరుపతి -భువనేశ్వర్‌ (02810) ప్రత్యేక రైలును అక్టోబరు 1, 8 తేదీల్లో  రద్దు చేశారు. అక్టోబరు 2, 9 తేదీల్లో చెన్నై సెంట్రల్‌-విశాఖ(22870) రైలు.. ఈనెల 26న, అక్టోబరు 3, 10 తేదీల్లో  సంబల్‌పూర్‌-ఈరోడ్‌(08311) ప్రత్యేక రైలు.. ఈనెల 27న, అక్టోబర్‌ 4 తేదీలలో ఈరోడ్‌-సంబల్‌పూర్‌(08312) ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. ఈనెల 29న, అక్టోబరు 6న విశాఖ-బెంగళూరు కంటోన్మెంట్‌(08543) స్పెషల్ రైలు రద్దయింది.

Also read : Sleep: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా ముఖ్యమే.. నిద్ర రావాలంటే ఇవి చేయాల్సిందే..?

బొకారో ఎక్‌ప్రెస్‌ ను దారి మళ్లించారు. ధన్‌బాద్‌-అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ అక్టోబరు 2, 10 తేదీల్లో నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తుంది. ఆయా రోజుల్లో తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌లను రద్దు చేశారు. తిరుపతి-విశాఖ(22708) డబుల్‌ డెక్కర్‌ రైలును అక్టోబరు 4, 6, 8 తేదీల్లో.. తిరుగు ప్రయాణంలో వచ్చే విశాఖ-తిరుపతి(22707) డబుల్‌ డెక్కర్‌ రైలును అక్టోబరు 5, 7, 9 తేదీల్లో (AP – Trains Cancelled) రద్దు చేశారు.