Site icon HashtagU Telugu

TTD Services: అక్రమార్కులను ‘ఆధార్’తో పట్టేస్తారు.. సేవలు సద్వినియోగం చేసుకోనున్న టీటీడీ!

Tirumala Gaushala

Tirumala Gaushala

TTD Services: నకిలీ గుర్తింపు కార్డులతో శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను పొందేందుకు అక్రమార్కులు చేస్తున్న యత్నాలకు చెక్ పెట్టేం దుకు టీటీడీ (TTD Services) సిద్ధమైంది. ఇందుకోసం ఆధార్ను టీటీడీలోని పలు సేవలకు అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్‌లైన్/ ఆఫ్ లైన్లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అనేది నిర్దారించుకునే వ్యవస్థ టీటీడీలో లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్‌ల‌పై టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్షించారు.

ఐటీ విభాగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఒకే మొబైల్ నంబరు, ఈ- మెయిల్, ఐడీతో పెద్ద మొత్తంలో బుకింగ్ జరిగినట్లుగా తేలింది. వసతి కోసం కరెంటు బుకింగ్ లో పలు గుర్తింపు కార్డులను చూపించి గదులు తీసు కొని వాటిని అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటు వంటి అక్రమాలను అరికట్టేందుకు అధికారులు అన్ని మార్గాలను పరిశీలిం చారు. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థతోపాటు ఆధార్ ప్రమా ణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.

Also Read: Hyderabad to Vijayawada : హైస్పీడ్ ట్రైన్స్.. గంటలోనే హైదరాబాద్ టు విజయవాడ.. విమానం కంటే చౌక!

యూఐడీఏఐ సేవలు

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులతో యూఐడీఏఐ ప్రతినిధులు సమావేశమై. సేవలకు ఆధార్ అనుసంధానం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆధార్ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు రెండేళ్లకు రిజిస్ట్రేషన్ రుసుము కింద రూ.20 లక్షలు తితిదే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఆధార్ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవై సీకి రూ.3.40 టీటీడీ కట్టాల్సి ఉంటుంది. ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి సైతం ఆధార్ సేవలను వినియోగించుకునేందుకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఆమోదముద్ర వేస్తే ఇక ఆధార్ సేవ లను టీటీడీలో వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,626 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.