Site icon HashtagU Telugu

Sharmila : అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?: షర్మిల

If you look in the mirror, does Jagan on Chandrababu face?: Sharmila

If you look in the mirror, does Jagan on Chandrababu face?: Sharmila

YS Sharmila: ఏపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) మరోసారి సీఎం జగన్‌(CM Jagan)పై విమర్శలు గుప్పించారు. కడపలో ఈరోజు ఆమె మాట్లాడుతూ..తనపై జగన్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో నేను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ షర్మిల నిలదీశారు. సీఎం జగన్ మానసిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే చంద్రబాబు పేరును జగన్ జపించడంపై ఆమె సెటైర్లు వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏం జరిగినా చంద్రబాబునే కారణమని జగన్ చెబుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌కు ఓ అద్దం పంపుతున్నానని, అందులో చూసుకోవాలని సూచించారు.

Read Also:AP : జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపడేసిన చంద్రబాబు 

అంతే కాకా అద్దంలో తనే కనిపిస్తున్నారో.. చంద్రబాబు కనిపిస్తున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రిని పోగొట్టుకున్న వైఎస్ సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని జగన్ చెబుతున్నారని షర్మిల గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు వింటారని చెబుతున్నారని, మోదీతో పొత్తు కూడా చంద్రబాబు పనేనని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అని జగన్ చెబుతున్నారో ఆలోచించాలన్నారు. సీఎం జగన్ మానసిక పరిస్థితిపై తనకు భయం వేస్తోందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.