Chandrababu: ఈ చిన్న లాజిక్ గమనిస్తే చంద్రబాబే సీఎం

తెలుగు దేశం మూలాల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దెబ్బ కొడుతోంది. ఆ విషయాన్ని ఇప్పటికీ చంద్రబాబు అండ్ టీం తెలుసుకోక పోవటం విచిత్రం.

  • Written By:
  • Updated On - March 5, 2023 / 03:11 PM IST

తెలుగు దేశం మూలాల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దెబ్బ కొడుతోంది. ఆ విషయాన్ని ఇప్పటికీ చంద్రబాబు (Chandrababu) అండ్ టీం తెలుసుకోక పోవటం విచిత్రం. వాస్తవంగా టీడీపీ మూలాలు బీసీ, బలిజ, తెలగ, ఒంటరి, ఎస్సీ మాదిగ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గాలు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ మాల, రెడ్డి , కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా ఉండేవి. ఆ ఓటు బాంక్ ఇప్పుడు వైసీపీ కి చేరింది. దీనితో పాటు బీసీ ఓటును ఆకట్టుకుంటు టీడీపీ మూలాల మీద కొట్టింది. బలిజ, కాపు, తెలగ ,ఒంటరి ఓటు మీద జనసేన మార్క్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓటు బాంక్ బదులు బీసీ లపై వైసీపీ దృష్టి పెట్టింది. దానికి విరుగుడుగా వైసీపీ ములాలపై దెబ్బ కొట్టే బదులుగా జనసేన పార్టీ ని వెనకేసుకురావడం గమనార్హం. ఇలాంటి ఆలోచన జనసేనకు మేలు మినహా టీడీపీకి వచ్చే లాభం ఏమీలేదు. వ్యూహాత్మకంగా జనసేన పార్టీని హైప్. చేస్తున్నారు. దాని కారణంగా బలిజ ,ఒంటరి ఓట్లను టీడీపీ కోల్పోతుంది. అటు టీడీపీ ఇటు వైసీపీ పోటీపడి జనసేనకు గుర్తింపు లేనప్పటికీ పెద్ద పార్టీగా ఫోకస్ చేసాయి. ఈ పరిణామం ఇరు పార్టీలు తమకే లాభం అంటూ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. వాస్తవంగా ములాల్లోకి వెళ్తే టీడీపీకి నష్టంలా క్షనిపిస్తుంది.

వైసీపీ మూలాల మీద దెబ్బ కొట్టాలి అంటే ఏపీలో కాంగ్రెస్ బలపడాలి. అప్పుడే దాని ములాన్ని కదిలించలేరు. ఇంత చిన్న లాజిక్ ను మరచిన చంద్రబాబు (Chandrababu) అండ్ టీం తికమక పడుతుంది. టీడీపీ క్యాడర్ , ఓట్లతో నామ రూపాలు లేకుండా తెలంగాణ లో టీడీపీని క్లోజ్ చేశారు. అంటే , టీడీపీ మూలాల మీద కొట్టారు. అలాగే, వైసీపీ మూలాల కాంగ్రెస్ ఓట్లు. ఆ ఓటు బాంక్ బడ్డలుగా చీలాలి అంటే, కాంగ్రెస్ ను ఏపీలో లేపాలి. అక్కడ జనసేనకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం పరోక్షంగా కాంగ్రెస్ కు ఇస్తే ఆ పార్టీ బలపడుతుంది. అప్పుడే వైసీపీ బలహీన పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ప్రత్యేక హోదా ను సాధిస్తామని కాంగ్రెస్ మరోసారి చెప్పింది. విభజన హామీలను నెరవేరుస్తామని ప్రామిస్ చేసింది. రాష్ట్రాన్ని విడదీసిన పాపాన్ని కడుక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది. విభజన హామీలను నెరవేర్చలేకపోతుంది.పైగా ఏపీని చిన్న చూపు చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు ఇస్తే వైసీపీ సంప్రదాయ ఓటు చీలుతుంది. అప్పుడు చంద్రబాబు (Chandrababu) అండ్ టీమ్ గట్టెక్కుతారు. అందుకు భిన్నంగా జనసేనకు మద్దతు ఇస్తే ఉన్నది.ఉంచుకున్నది అనే సామెత లా ఆ పార్టీ పరిస్థితి ఉంటుంది.

గత ఎన్నికల్లో ఎలాంటి ప్రయత్నం లేకుండా 2 శాతం ఓటు బాంక్ కాంగ్రెస్ కు ఏపీలో వచ్చింది. కొంచం ప్రయత్నం చేస్తే 8 నుంచి 10 శాతం వరకు కాంగ్రెస్ చీల్చుకుంటుంది. ఆ ఓటు బాంక్ దాదాపుగా 80 శాతం వైసీపీ సంప్రదాయ ఓటు ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ చంద్రబాబు కనిపెడితే తిరుగులేకుండా ఒంటరిగా అధికారంలోకి రావడం ఖాయం. అందుకు భిన్నంగా జనసేనతో వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే ఉంటుందని సామాజిక స్పృహ, క్షేత్ర స్థాయి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ల అభిప్రాయం. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను గ్రహిస్తారా? అతి ప్రేమ తో వాస్తవాలను దాచేసే సానుకూల మీడియా చెప్పే అవగాహన లేని మాటలను నమ్ముతారా?అనేది ఆయన లక్ మీద ఆధారపడింది.

Also Read:  Zomato: మా కమీషన్‌ పెంచండి.. కొన్ని రెస్టారెంట్లకు జొమాటో మెసేజ్.. ఎందుకంటే?