Guntur Candidates Assets : వామ్మో.. గుంటూరు అభ్యర్థుల ఆస్తులా మజాకా !

Guntur Candidates Assets :  గుంటూరు జిల్లాలో ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు.

  • Written By:
  • Updated On - March 25, 2024 / 09:34 AM IST

Guntur Candidates Assets :  గుంటూరు జిల్లాలో ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. కోట్లు ఖర్చయ్యే కాస్ట్లీ ఎలక్షన్ ఈ జిల్లాలో జరుగుతుంటుంది. ఎందుకంటే.. ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులు అంత రిచ్ బ్యాక్ గ్రౌండ్‌ను కలిగి ఉంటారు. ఈసారి గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల(Guntur Candidates Assets) ఆస్తుల గురించి తెలిస్తే మీరు ఔరా అనక మానరు !!

We’re now on WhatsApp. Click to Join

నారా లోకేశ్ ఆస్తులు

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ బరిలోకి దిగారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇక్కడి నుంచి రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఆర్థికంగా ఆయన్ను ఢీకొట్టే అభ్యర్థి జిల్లాలోనే లేడు. ఆయనకున్న నికర ఆస్తులు రూ.373 కోట్లు. అప్పులు రూ.10 కోట్లు. వివిధ బ్యాంకుల్లో బాండ్ల రూపంలో రూ.మూడున్నర కోట్లు ఉండగా, వివిధ కంపెనీల్లో లోకేశ్‌కు ఉన్న షేర్ల విలువ రూ.255 కోట్లకుపైనే. పర్సనల్ లోన్ అడ్వాన్స్‌ మరో రూ.ఎనిమిదిన్నర కోట్లు తీసుకున్నారు. లోకేశ్ పేరిట ఫోర్డ్ ఫియిస్టా, రెండు ఫార్చూనర్ కార్లు ఉన్నాయి. లోకేశ్ వద్దనున్న బంగారం, వజ్రాభరణాల విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా ఆయన చరాస్తుల విలువ 271 కోట్లు. హైదరాబాద్ మదీనాగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని విలువ 47 కోట్లు. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌, మాదాపూర్, మణికొండలో ఉన్న స్థలాల విలువ మరో రూ.30 కోట్లు.  చెన్నైలో ఐదు కోట్ల విలువైన  కమర్షియల్ బిల్డింగ్ ఉండగా..జూబ్లీహిల్స్‌లో 20 కోట్ల విలువైన ఇల్లు ఉంది.

Also Read : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేర్లు ?

విడదల రజని ఆస్తులు

వైఎస్సార్ సీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనికి దాదాపు 130 కోట్ల విలువైన ఆస్తి ఉంది. అప్పులేమీ లేవు. వివిధ బ్యాంకుల్లో ఐదుకోట్ల డిపాజిట్లు ఉండగా.. ఎల్‌ఐసీ ఇన్స్‌రెన్స్‌ పాలసీలు మరో ఐదుకోట్లు ఉన్నాయి. మొత్తం ఆరున్నర కోట్ల చరాస్తులు ఉండగా.. వ్యవసాయ భూములు, ప్లాట్లు, కార్లు ఏమీ ఆమె పేరిట లేవు. కోటిన్నర విలువ చేసే ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. అయితే అమెరికాలో ఆమె పేరిట ఉన్న సాప్ట్‌వేర్ కంపెనీ విలువ 120 కోట్లు.

జీవీ ఆంజనేయులు ఆస్తులు

టీడీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆస్తుల విలువ దాదాపు రూ.88 కోట్లు ఉంది. ఆయనకు 6 కోట్ల రూపాయల అప్పు ఉంది. బ్యాంకుల్లో బాండ్లు, వివిధ సంస్థల్లో షేర్లు అన్నీ కలిపి  ఆంజనేయులు  చరాస్తులు 25 కోట్లు ఉన్నాయి. పర్సనల్ లోన్లు మరో 17 కోట్లు తీసుకున్నారు. కోటిన్నర బంగారు ఆభరణాలు ఉండగా.. మొత్తం చరాస్తుల విలువ 45 కోట్లు వరకు ఉంది. కోటిన్నర విలువైన వ్యవసాయ భూములు, 16 కోట్ల విలువైన ప్లాట్లతోపాటు హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో 10 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌, వినుకొండలో మరో 15 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 42 కోట్లు ఉంది.

ప్రత్తిపాటి పుల్లారావు ఆస్తులు 

టీడీపీ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రూ.42.5 కోట్ల ఆస్తులు ఉండగా.. రూ.25.34 కోట్ల అప్పు ఉంది. బ్యాంకులో క్యాష్, బాండ్లతో పాటు వివిధ సంస్థల్లో షేర్లు కలిపి మొత్తం చరాస్తులు విలువ దాదాపు రూ.40 కోట్లు వరకు ఉంది. వివిధ చోట్ల ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు విలువ మొత్తం కలిపి మొత్తం మరో మూడుకోట్ల వరకు ఉంది. అలాగే ఆయన వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు 25.34 కోట్లు ఉంది.

కన్నా లక్ష్మీనారాయణ ఆస్తులు

టీడీపీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సైతం రూ.40 కోట్లు విలువైన ఆస్తులు,  రెండున్నర కోట్ల అప్పు ఉంది. వివిధ బ్యాంకుల్లో ఉన్న బాండ్లు, షేర్లు, అన్నీ కలిపి దాదాపు 3 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. 2 కోట్ల విలువైన వ్యవసాయ భూములు ఉండగా.. 20 కోట్ల విలువైన ప్లాట్లు ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఇళ్ల విలువ మరో రూ.15 కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.2.25 కోట్లు ఉంది.

Also Read :Gali Janardhan Reddy : ‘‘నా బ్లడ్‌లోనే బీజేపీ’’.. ఇవాళ బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం

కోన రఘుపతి ఆస్తులు

వైఎస్సార్ సీపీ నేత, ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి కోన రఘుపతికి రూ.28 కోట్లు విలువైన ఆస్తులు ఉండగా, రూ.83 లక్షల అప్పు ఉంది. బ్యాంకులో డిపాజిట్లు, బాండ్లు కలిపి రెండున్నర కోట్ల ఆస్తి ఉంది. వ్యవసాయ భూమి ఏమీ లేదు. బాపట్లలో ఒక ప్లాట్ ఉంది. హైదరాబాద్ ఉప్పల్‌లో రెండు కమర్షియల్ బిల్డింగ్‌లు, బాపట్లలో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. వీటి విలువ దాదాపు రూ.18 కోట్ల పైమాటే. హైదరాబాద్, బాపట్లలో ఉన్న ఇళ్ల విలువ మరో రూ.7 కోట్ల వరకు ఉంటుంది. మొత్తం స్థిర ఆస్తుల విలువ రూ.25 కోట్ల 72 లక్షలు ఉంటుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.83 లక్షలుగా ఉంది.

అంబటి రాంబాబు ఆస్తులు 

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు పేరిట రూ.15 కోట్ల విలువైన ఆస్తులు, కోటీ 20 లక్షల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, పర్సనల్ లోన్లు, కార్లు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి చరాస్తులు రెండుకోట్లు ఉండగా..  అవనిగడ్డ, సూరంపల్లిలో ఉన్న వ్యవసాయ భూముల విలువ దాదాపు 6 కోట్లు ఉంది. మరో కోటి రూపాయల విలువైన ప్లాట్లు ఉండగా.. గుంటూరు, హైదరాబాద్‌లో కలిపి మరో ఆరుకోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇల్లుతో కలిపి మొత్తం స్థిరాస్తి విలువ 13 కోట్ల 20 లక్షలు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న అప్పు కోటీ 20 లక్షలుగా ఉంది.