Site icon HashtagU Telugu

Roja : రోజాకు టికెట్ ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం – అధిష్టానానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక

Roja Nagari

Roja Nagari

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..అభ్యర్థుల (Candidates ) జాబితను రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే 9 జాబితాలు రిలీజ్ చేసారు. ప్రతి నియోజకవర్గం ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని టికెట్ ఇస్తున్నారు. ఏమాత్రం సదరు అభ్యర్థి ఫై వ్యతిరేకత ఉన్న పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలకు , మంత్రులకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో నగరి (Nagari) టికెట్ మరోసారి రోజా (Roja) కు ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం అని ఆయా నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే ఈ విషయాన్నీ జగన్ కు తెలియజేసారు. కానీ ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు తమ మండలాల పరిధిలో మంత్రి ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ధిక్కార స్వరాన్నితెలియజేస్తున్నారు. ఇటీవల రూ. 50 లక్షల తుడా నిధులతో రోజా అన్న రామ్​ప్రసాద్​ రెడ్డి కాలువల పనులకు భూమిపూజ చేయడం ఎంత వరకు సమంజసమని వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్​ రెడ్డి ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో రోజా అన్నదమ్ములు ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయవచ్చు తాము చేయకూడదా? అని వ్యాఖ్యానించారు. తాము మంత్రి రోజాను వ్యతిరేకిస్తున్నామే తప్ప పార్టీని కాదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోజా ..ఆమె అన్నదమ్ములు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, ఏది వదిలిపెట్టడం లేదని , ప్రతి దాంట్లో వాటాలు అడుగుతున్నారని , లేదంటే అడ్డు చెపుతున్నారని ..ఈ క్రమంలో మరోసారి ఆమెకు టికెట్ ఇస్తే దగ్గర ఉండి టిడిపి అభ్యర్థి భాను ను గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. మరి ఎన్ని హెచ్చరికల నడుమ రోజా కు టికెట్ ఇచ్చే సాహసం జగన్ చేయరనే అంత భావిస్తున్నారు.

Read Also : Rahul Gandhi – PAK : పాకిస్తాన్ కన్నా భారత్‌లోనే నిరుద్యోగం ఎక్కువ : రాహుల్