సీబీఎస్ఈ కాక‌పోతే ఐసీఎస్ఈ..?

ఏపీలోని అన్నిపాఠ‌శాల‌ల‌కు సీబీఎస్ఈ అఫిలియేష‌న్ తీసుకురావాల‌ని ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విద్యాశాఖ అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో 45వేల పాఠ‌శాల‌ల‌కు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెంక‌డ‌రీ ఎడ్యుకేష‌న్(సీబీఎస్ఈ)

  • Written By:
  • Updated On - October 23, 2021 / 11:30 AM IST

ఏపీలోని అన్నిపాఠ‌శాల‌ల‌కు సీబీఎస్ఈ అఫిలియేష‌న్ తీసుకురావాల‌ని ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విద్యాశాఖ అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో 45వేల పాఠ‌శాల‌ల‌కు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెంక‌డ‌రీ ఎడ్యుకేష‌న్(సీబీఎస్ఈ) అనుబంధాన్ని క‌ల్పించే ప్ర‌క్రియ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించింది. అయితే పాఠ‌శాల‌లు అన్నింటికి సీబీఎస్ఈ అఫిలియేష‌న్ వ‌స్తుందా రాదా అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. సీబీఎస్ఈ అఫిలియేష‌న్ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లిగించే లోపాల‌ను గుర్తించి వాటిని ప‌రిష్క‌రించాల‌ని సీఎం జ‌గ‌న్ విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు.

అనుబంధ ప్రక్రియలో భాగంగా పాఠశాల‌ల్లో వివిధ అంశాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లు అవసరమయ్యే ప్రక్రియ ఉంటుంది . దేశవ్యాప్తంగా CBSE కి అనుబంధంగా ఉన్న మొత్తం పాఠశాలల సంఖ్య 25,000 మాత్ర‌మే…. అయితే ఒకేసారి 45వేల పాఠ‌శాల‌ల‌ను అనుబంధం చేయ‌డంపై సీబీఎస్ఈ అధికారులు వెనుక‌డుగు వేస్తున్నారు. కార‌ణం సీబీఎస్ఈ ప్ర‌మాణాల‌ను ఈ పాఠ‌శాల‌లు పాటిస్తాయా లేదా అనేది వారిలో అనుమానం క‌లుగుతుంది. పాఠ‌శాల‌ల‌కు సంబంధించి మౌలిక స‌దుపాయాలు, స‌మ‌ర్థ‌వంత‌మైన ఉపాధ్యాయులుతో పాటు ఇత‌ర ప్ర‌మాణాల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే సీబీఎస్ఈకి త‌గ్గ ప్ర‌మాణాల‌ను క‌ల్పిస్తామ‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఒక‌వేళ సీబీఎస్ఈ అనుబంధం కాక‌పోతే ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాయం ఉంద‌ని…ఇండియ‌న్ స‌ర్టిఫికేట్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(ఐసీఎస్ఈ) అనుబంధాన్ని ఎంచుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

వచ్చే వారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలవబోతున్నామ‌ని…ఏపీ పాఠ‌శాల‌ల్లో సీబీఎస్ఈ సిల‌బ‌స్ అమ‌లు కోసం కేంద్రం ఆమోదించాల‌ని కోరనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఏపీ విద్యార్థులు CBSE పరీక్షలు రాసేలా చూడాలని ముఖ్యమంత్రి నిశ్చయించుకున్నార‌ని….విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌లు ప్రారంభ‌మైయ్యాయ‌ని పేర్కొన్నారు. ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ సెటప్, ఇంగ్లీష్ మీడియం భోద‌న గురించి కేంద్ర మంత్రికి వివరంగా వివ‌రించ‌నున్నారు . భౌతిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి, వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్‌, క్రీడా యూనిఫాంను అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న విభాగాల నుండి వచ్చిన విద్యార్థుల అవసరాలకు తగిన విధంగా సంస్కరించబడిన విద్యా వ్యవస్థను అమలు చేయడానికి ముఖ్యమంత్రి ఆసక్తిగా ఉన్నార‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు.