Site icon HashtagU Telugu

Minister Lokesh: తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారు: మంత్రి లోకేష్‌

Minister Lokesh

Minister Lokesh

Minister Lokesh: కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి సీఎం చంద్రబాబు అడ్వాంటేజ్ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిపూర్ణత సాధించాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నా బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నాను. స్టాన్ ఫోర్ట్ ఎంబీయే బిజినెస్ కు మంచిది. రాజకీయాలకు పాదయాత్ర చాలా ముఖ్యం. పాదయాత్ర రాజకీయాల్లో ఎంబీయే వంటిది. పాదయాత్ర ద్వారా సమస్యలను మరింత బాగా అర్థంచేసుకోగలగుతున్నాను. నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నాను.

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుచేస్తాం

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుచేస్తాం. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. వైటూకే విప్లవంలో హైదరాబాద్, దేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఏపీ వంతు. నైపుణ్యం గలిగిన మానవ వనరులు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకువెళ్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ లో మార్పులు తీసుకువస్తున్నాం. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చింది. ఈ నెలాఖరునాటికి 350 సేవలను మనమిత్ర ద్వారా ప్రజలకు అందించనున్నాం. కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ సేవలో పొందవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్ లో మరిన్ని సేవలను ప్రజలక అందుబాటులోకి తీసుకువస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ కు అందరూ సిద్ధంగా ఉండాలి.

కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు గారు అడ్వాంటేజ్

కర్టాటకకు బెంగుళూరు, తమిళనాడు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ సిటీలు ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం చంద్రబాబునాయుడు గారు ఉన్నారు. ఆయనే మాకు అడ్వాంటేజ్. ఈ శుక్రవారం టాటా పవర్ తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నైపుణ్యగణన కంటే కుల గణన చాలా సులభం. రాష్ట్రంలో నైపుణ్య గణనను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం.

Also Read: Nara Lokesh: బ్రాహ్మణికి ఇంకో కొడుకును నేనే.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం

త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుంది. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం. స్థానిక భాష తెలుగు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదు. నర్సులు, హోంకేర్ ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆ భాషలను సైతం నేర్చుకోవాలి. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరం. ఎన్డీయే కు మేం బేషరతుగా మద్దతు ఇస్తున్నాం.

వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసg నమోదు చేశారు. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. వైసీపీ హయాంలో నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేదు. మా ఇంటికి తాళ్లు కట్టారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం కంటే జగన్ కు భద్రత ఎక్కువ. వైసీపీ పాలనలో మద్యంలో అవినీతి, ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది.

జగన్ రెడ్డి వైసీపీకి నాయకుడు

1990ల్లో అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగేవి. నేడు అలాంటి చర్చలు లేకపోవడం బాధాకరం. జగన్ రెడ్డి వైసీపీకి నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. మేం చట్టాలను గౌరవిస్తాం. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తాం?

మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలుపొందా

1985 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని మంగళగిరి నుంచి పోటీచేసి 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశాను. 2024 ఎన్నికల్లో పోరాడి 91వేల భారీ మెజార్టీతో గెలిచాను. ఏపీలో ఇది మూడో అత్యధిక మెజార్టీ. కష్టమైన హెచ్ ఆర్డీ శాఖను ఎంచుకున్నానన్నారు. తన భార్య బ్రాహ్మణి తన క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుందని, మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు …ప్రతిరోజూ జరుపుకోవాలని అన్నారు.

Exit mobile version