Site icon HashtagU Telugu

Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్

Vijayasai Reddy Vs Jagan Ysrcp Nara Lokesh Cm Chandrababu Tdp Andhra Pradesh

Vijayasai Reddy Vs Jagan: వైఎస్సార్ సీపీపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.  ‘‘నన్ను కెలికితే, ఇరిటేట్ చేస్తేనే రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల వైఎస్ జగన్‌కు నష్టం కలగాలని కోరుకుంటున్న వాళ్లే నన్ను రెచ్చగొడుతున్నారు.  వైఎస్సార్ సీపీలోని ఆ  కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉంటుంది. కానీ వైఎస్ జగన్‌కు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు’’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ఒక ట్వీట్ చేశారు.  తాను మౌనంగా ఉండటం వైఎస్సార్ సీపీలోని కోటరీకి ఇష్టం లేకే..  తనపై పార్టీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Also Read :Formula E Case : ఫార్ములా – ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కవిత ట్వీట్

నేను అనుకుంటే.. నారా లోకేష్, చంద్రబాబు‌ను కలుస్తా

‘‘ఔను..  నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లాను. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబంతో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయంలో టీడీపీ నేత టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్, చంద్రబాబు‌ను కలుస్తా. అంతేకానీ వేరేవాళ్లతో ఎందుకు చర్చిస్తాను ?  వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు కానీ.. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy Vs Jagan) స్పష్టం చేశారు. ‘‘లిక్కర్ స్కామ్ జరగలేదు అని జగన్ అంటుంటే.. ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరీ అంటున్నారు. ఆ  స్కామే  లేనప్పుడు, నేనేం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో ఏ1 గురించి చెప్పానే కానీ, వేరే ఎవ్వరినీ నేను ప్రస్తావించలేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు.

Also Read :Cabinet Expansion: పార్టీ పదవుల వ్యవహారం.. పలువురు సీనియర్లపై రాహుల్ ఫైర్

కోటరీ మాటలు నమ్మి.. నన్ను జగన్ పక్కన పెట్టారు

‘‘నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దామని వైఎస్సార్ సీపీ కోటరీ నిర్ణయించుకున్నందున,  నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. 2011లో 21 కేసులను పైన వేసుకున్న..  2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే నేను (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో. కోటరీ వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా వైఎస్  కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు.