ఉద్యోగులను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని జగన్ తెలుసుకున్నాడు. గతంలో వాళ్ళను నమ్మి అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్లలో చంద్రబాబు ముఖ్యుడు. గతంలో ఎప్పుడు లేని ప్రాధాన్యం ఉద్యోగులకు బాబు ఇచ్చాడు. వాళ్ళను నెత్తి న కూర్చోబెట్టుకున్నాడు. స్వాతంత్రయం వచ్చిన తరువాత ఏర్పడిన ఏ ప్రభుత్వం ఉద్యోగుల కు ప్రాధాన్యం ఇవ్వలేదు. బడుగు , బలహీన వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఉండేలా గత సీఎం లు రాష్ట్రాన్ని పాలించారు. స్వర్గీయ ఎన్ఠీఆర్ కూడా ప్రజాసేవకులం మనం అంటూ వాళ్లకు గుర్తు చేసేవాడు. జీతాలు ఇష్టానుసారంగా పెంచడానికి ఒప్పుకోలేదు. పలుమార్లు అప్పుడు ఉద్యోగులు డిమాండ్స్ పెట్టినప్పటికి ఆయన ఎంత పెంచాలో అంతే పెంచాడు. కానీ చంద్రబాబు సీఎం అయిన తరువాత ఉద్యోగుల ఆట ఆడిందిగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వాన్ని మార్చేశారు. బాబు కూడా వాళ్ళ మద్దతు కోసం జీతాలు అనూహ్యంగా పెంచిన సందర్భాలు అనేకం. కానీ, 2004 లో ఆయన ఓడిపోయాడు. ఆ రోజున ఉద్యోగులు అందరూ బాబు గెలుపుకు చాలా ప్రయత్నం చేశారు. వాళ్లే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను సూచించారు. స్వర్గీయ వైస్సార్ కు అనుకూలంగా ఉన్న ఉద్యోగులు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సంపూర్ణ మద్దతు 2004 ఎన్నికల్లో బాబుకు ఉద్యోగులు ఇచ్చినా ఘోరంగా ఓడిపోయాడు. దానికి ప్రధాన కారణం ఉద్యోగుల అవినీతి సామాన్యులను పీడించింది. ఫలితం బాబు ఇప్పటికి రాజకీయంగా కొలుకోలేక పోతున్నాడు.
ఇక దివంగత వైఎస్ ఏనాడు ఉద్యోగులను పూర్తిగా నమ్మలేదు. కేవలం ఆయన నమ్ముకున్న వాళ్ళను సిఎం కార్యాలయంలో పెట్టుకొని పాలన సాగించాడు. అందుకే ఎంత పీఆర్సీ ఇవ్వాలో అంతే ఇచ్చాడు. ఉద్యోగుల గొంతమ్మ కోర్కెలకు ఎప్పుడు జై కొట్టలేదు. అందుకే 2009 లో కూడా ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యాడు. ఉద్యోగుల గొంతమ్మ కోర్కెల చిట్టాకు రెక్కలు వచ్చాయి. వాళ్ళు ఆడిగినవి..అడగనివి..అన్నీ ఇచ్చాడు. రాష్ట్ర బడ్జెట్ ను కోలుకునివ్వకుండా జీతాలను వివిధ రూపాల్లో పెంచుకున్నారు. అందుకే బాబు దిగిపోయే నాటికి 4 లక్షల కోట్ల అప్పు అయింది. ఉద్యోగులు 2014 నుంచి 2019 ఎన్నికల వరకు వాళ్ళు ఆడింది ఆట పడింది పాట గా మెలిగారు. ఒకానొక సమయంలో ప్రభుత్వాన్ని వాళ్ళే డిక్టేట్ చేశారు. అవినీతి రెండు అంకెలకు తీసుకెళ్లారని ఆనాడు బాబు నెత్తినోరు బాదుకున్నాడు. కానీ ఉద్యోగులను ఏమీ చేయలేక పోయాడు.పైగా పదవీ విరమణ చేసిన వాళ్ళను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. వివిధ రకాల పదవులు వాళ్ళకు కట్టబెట్టారు. ఇంత చేసి మళ్ళీ గెలిచాడా? అంటే ఘోరంగా 23 ఎమ్మెల్యే లకు పరిమితం అయ్యాడు. ఆయన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఉద్యోగులకు ఇచ్చిన ప్రాధాన్యం బహుశా ఏ సిఎం కూడా ఇవ్వలేదని అందరికి తెలుసు. సీన్ కట్ చేస్తే రాజకీయ జీవితమే బాబుకు ప్రశ్నర్ధకం అయింది. దీనికి ప్రధాన కారణం ఆయన ఉద్యోగులను నమ్ముకుని పాలన చేయడం అని తెలుస్తుంది. ఇక దివంగత రోశయ్య హయాం లోనూ ఉద్యోగులు పెత్తనం చేశారు. చివరకు అంత మేధావి కూడా పదవిని వదులుకున్నారు.
ఇదీ ఉద్యోగుల పెత్తనం కారణంగా జరిగిన తతంగానే చూడొచ్చు. ఇప్పుడు జగన్ హయాం లో కూడా ఉద్యోగులు ఉడత ఊపులు ప్రారంభించారు. ఇప్పుడు జగన్ తలొగ్గితే భవిష్యత్ లో కూడా బాబు మీద లాగా పెత్తనం చేయడానికి సిద్దం కావాలని ప్లాన్. ఇప్పుడు జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటాడో దానిపై ఆయన రాజకీయ భవిష్యత్ ఉందని మైండ్ గేమ్ ఆడుతున్నారు.దానికి జగన్ వ్యతిరేక మీడియా మద్దతు ఇస్తుంది. ఇక్కడ జగన్ గురించి చెప్పాలి అంటే కచ్చితంగా మిగిలిన వాళ్లకు భిన్నంగా ఉంటాడు. భయపెడితే భయపడే రకం కాదు. పైగా వాస్తవాలకు అనుగుణంగా పీఆర్సీ ప్రకటించాడు. గతంలో చేసిన అప్పులు తీర్చుతూ మళ్ళీ అప్పులు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్ర అప్పును 7 లక్షల కోట్లకు చేర్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు గొంతమ్మ కోర్కెలు కోరడం సహజంగా సామాన్యులు ఇష్టపడరు. అందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో పోస్టులు చూడొచ్చు. ఉద్యోగులపై సామాన్యులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కోవిడ్ లో పడిన బాధ వాళ్ళను వెంటాడుతోంది. పైగా పనిచేయకుండా రెండేళ్ళు జీతాలు తీసుకున్న ఉద్యోగులను సామాన్యులు చూసారు. దీంతో కడుపు మండి కొందరు సోషల్ మీడియాలో వీడియోలో పెడుతున్నారు. ఇదంతా నిఘా వర్గాలు ద్వారా తెలుసుకున్న సీఎం గత సీఎంల మాదిరిగా భయపడి జీతాలు ఉద్యోగుల ఇష్టం వచ్చినట్టు పెంచేందుకు సిద్ధంగా లేడని తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులపై ఫైట్ చేయడానికి కార్యాచరణ ఉంటుందని తాడేపల్లి వర్గాల టాక్. సో.. ఉద్యోగులను జగన్ నమ్ముకుంటాడా? లేదా సామాన్యుల కష్టాలను చూస్తాడా? అనేది ఇవాళ తెలుస్తుంది. చంద్ర బాబు లాగా ఉద్యోగుల మాట నమ్మితే ఏమౌతుందో.. ఇప్పటికే చరిత్ర చెబుతోంది. సో. ఇక జగన్ ఇష్టమే.!