Chandra Babu : మళ్ళీ జగన్ కు ఛాన్స్ ఇస్తే ఇక అంతే! టీడీపీ వినూత్న ప్రచారం

ఒక వేళ 2014 లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ అలా ఉండేదో ఊహిస్తూ వివరణ

  • Written By:
  • Publish Date - January 7, 2023 / 12:00 PM IST

తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. #ఆలోచించుఆంధ్రుడా #మేలుకోఆంధ్రుడా #YCPDestroyedAP #APinCrisis #APHopeCBN అనే హాష్ ట్యాగ్ లతో చంద్రబాబు (Chandra Babu), జగన్ పాలనకు తేడాను చూపిస్తూ వైరల్ చేస్తున్నారు. ఒక వేళ 2014 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ అలా ఉండేదో ఊహిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు పాలన గురించి ఆలోచింప చేసేలా ఆర్టికల్స్ ను పోస్టు చేస్తున్నారు. దానిలో పలు విధాన, అభివృద్ధి అంశాలను పొందుపరిచారు.

మెజారిటీ ప్రజలు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఆనాడు చంద్రబాబు (Chandra Babu) పాలనకు మధ్య తేడా పై ఒక స్పష్టమైన అవగాహనకి, అంచనాకి వచ్చారని భావిస్తూ పలు అంశాలను జోడించారు. వాటి వివరాలను చూస్తే …

ఆనాడు లక్షా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్టు, చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇప్పటిలా రోజుకి సుమారుగా 35కోట్ల ఆదాయాన్ని ఇస్తున్న కియా మోటర్స్ లేదు. నెల వారి స్థిరమైన కోట్ల ఆదాయాన్ని ఇచ్చే ఇసుజు మోటర్స్ లేదు, హీరో మోటార్స్ లేదు, అశోక్ లేలెండ్ లేదు ,ఏషియన్ పెయింట్స్ లేదు, బ్రిటానియా బిస్కెట్స్ లేదు, క్యాడ్బరీ లేదు, కార్బన్ ఫోన్స్ లేదు, సెల్కాన్, ఫాక్స్ కాన్, షామీ, రెడ్మీ, ఆసస్, టిసిఎస్, డిక్సన్ లాంటివేవీ లేవు.

AP39 సీరీస్ : ఒన్ స్టేట్ – ఒన్ నంబర్, రవాణాశాఖకి అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న ఆచరణ అప్పటికి లేదు. క్రిష్ణా డెల్టా క్రింద సిరుల పంటలు పండించిన పట్టి సీమ లేదు,2014-19 మద్యకాలంలో పూర్తిచేసిన 29 సాగునీటి ప్రాజెక్టులు లేనేలేవు, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఆ ఆలోచనే లేదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రానికి స్థిరమైన ఆదాయం లేదు.

చంద్రబాబు (Chandra Babu) పాలన:

*విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్నులు పెంచలేదు, చెత్త పన్నులు వెయ్యలేదు, రోడ్డు సెస్సులు వెయ్యలేదు, కరెంటు కోతలు లేకుండా చేసారు, నిత్యావసరాల ధరలు అదుపులో ఉండేలా చూసారు.

*పెళ్ళి కానుకలు, పండుగ కానుకలతో మొదలు పెట్టి డ్వాక్రా మహిళలకు 30వేల లబ్ది చేకూర్చారు. ఆదరణ పనిముట్లు, విదేశీ విద్య, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు.

*ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఎం. ఆర్. పి ధరలకే మద్యం అమ్మేలా చేసారు. 16,500 కోట్లు రైతు రుణ మాఫీ చేసారు. కౌలు రైతులకు రూ. 4757 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు.

*సాగునీటి ప్రాజెక్టులకు 63,000 కోట్లు ఖర్చు చేసారు. మానవ వనరుల అభివ్రుద్దికి 1,31,000 కోట్లు ఖర్చు చేసారు.1,05,000 కోట్లతో… మౌలిక సదుపాయాలు కల్పించారు.

*సంక్షేమ పధకాలకు… లక్ష కోట్లు ఖర్చు చేసారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై… రూ. 2514 కోట్ల వడ్డీ భరించారు. చంద్రన్న భీమా కింద రూ. 2381 కోట్లు చెల్లించారు.3 లక్షలకు పైగా ఇళ్ళ లబ్దిదారులతో గ్రుహప్రవేశాలు చేయించారు. సుమారు 8లక్షల టిడ్కో ఇళ్ళు నిర్మించి గ్రుహప్రవేశానికి సిద్దంగా ఉంచారు.

*రైతులకు ట్రాక్టర్లు, దళిత సోదరులకు ఇన్నోవాలు, పవర్ ఆటోలు, ట్రక్కులు, కాపు సోదరులకు హ్యుందాయ్ కార్లు, బ్రాహ్మణ సోదరులకు డిజైర్ కార్లు ఇచ్చారు.

*ప్రభుత్వోద్యోగులకు 43% పిఆర్సి ఇచ్చారు. డిఏ బకాయిలు, నెల మొదటి తారీఖుకి జీతాలు చెల్లించేవారు. అంగన్ వాడీలు మొదలుకుని పారిశుద్యకార్మికులు, వి. ఆర్. ఏ లకు, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారు.

*150 రూపాయలకే కేబుల్, ఇంటర్నెట్ & ఫోన్ సౌకర్యం కల్పించారు.100 రూపాయలు ఉన్న వ్రుద్దాప్య పించన్ ని 1000 కి, వెయ్యి నుండి 2000 కి పెంచారు.

*వితంతు మహిళలు మొదలుకుని డప్పు కళాకారులకు ట్రాన్స్ జెండర్లకు ఫించన్లు పెంచి ఇచ్చారు. నాలుగున్నర లక్షల మందికి నిరుద్యోగ బ్రుతి ఇచ్చారు. పల్లెల్లో వందల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, లక్షల సంఖ్యలో ఎల్.ఇ.డి విద్యుత్ దీపాలు వేసారు.

Also Read:  AP Politics: జగన్ కు షాక్.. టీడీపీలోకి మాజీ హోంమంత్రి!

2019 నుండి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పాలనలో:

*కియా మొదలైన పరిశ్రమల నుండి నెల వారీ… స్థిరమైన (జిఎస్టీ ఆదాయం) వేలకోట్ల ఆదాయం వస్తోఁది. ఇసుక అమ్మకాల ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తోఁది. షాక్ కొట్టేలా రేట్లు పెంచిన మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తోఁది. రెవిన్యూశాఖ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా పన్నుల రూపంలో అయితే, జిఎస్టీ రూపంలో అయితే వేలకోట్ల ఆదాయం వస్తోఁది. గత ప్రభుత్వం… వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగ ప్రొత్సాహక చర్యల ఫలితంగా వేల కోట్ల ఆదాయం వస్తోఁది. రూ.150 గా ఉన్న ఫైబర్ నెట్ చార్జీలను రూ. 350 కి పెంచడం ద్వారా రెట్టింపు ఆదాయం వస్తోఁది.

*ఏటా 15% ఆస్తిపన్ను పెంపు ద్వారా, 6 సార్లకు పైగా పెంచిన విద్యుత్ చార్జీల ద్వారా, 3 సార్లకు పైగా పెంచిన ఆర్.టీ.సీ చార్జీల ద్వారా, చెత్తపన్ను ద్వారా, ఆస్తి విలువ పెంచడం (భూముల మార్కెట్ విలువ) (రిజిస్ట్రేషన్ల ఆదాయం,) ద్వారా, రవాణాశాఖలో వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు ద్వారా, లోడు వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ ద్వారా, వాహనాల పై రెట్టింపు చేసిన చలానాల ద్వారా, రోడ్డు సెస్సు ద్వారా, OTS, OTC నాలా పన్నుల ద్వారా ఎన్నో వేలకోట్ల వస్తున్నప్పటికీ జగన్ పాలన గందరగోళం.

*జీతాలు, పెన్షన్లు టైముకి ఇవ్వలేకపోతున్నాడు! పోలవరం (కేఁద్రం నిధులు ఇస్తున్నప్పటికీ) కట్టలేక పోతున్నాడు. రోడ్ల పై గుంతలు పూడ్చలేక పోతున్నాడు. పెండింగ్ బిల్లులు చెల్లించలేక పోతున్నాడు. సచివాలయాల, ఆర్బికేల అద్దెలు కూడా కట్టలేక పోతున్నాడు. కేఁద్రం ఇచ్చే ప్రాజెక్టులకు రాష్ట్రవాటాలు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ప్రభుత్వోద్యోగులకు 24% పి. ఆర్. సి మాత్రమే ఇచ్చాడు, 10 డి. ఏలు బకాయిలు పెట్టేసాడు.

*లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నెలలో 20రోజులు ఓడీ డబ్బులతో గెంటుకొస్తున్నాడు. ఇవి కూడా చెప్పుకుంటూ పోతే… పేజీలకు పేజీలు రాసుకుంటూ పోవాలి !ఇప్పుడే ఇలా ఉంటే !! 2014లో వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎలా ఉండేది అంటూ పలు అంశాలను తెలియచేస్తూ 2024లో కూడా జగన్ వస్తే మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ సైన్యం ప్రచారం వినూత్నంగా మొదలు పెట్టింది.

Also Read:  Chandrababu warns Jagan: కుప్పంలో హైటెన్షన్.. జగన్ పై చంద్రబాబు ఫైర్!