Site icon HashtagU Telugu

IBM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఏపీలో IBM సెంటర్స్

Ibm

Ibm

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఒక శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ ఐబీఎం (IBM) అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో తమ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం కల్పించనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐబీఎం ప్రతినిధి క్రౌడర్ తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో భారత్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Bar License Lottery : నేడు ఏపీలో బార్ల లైసెన్స్ లాటరీ

క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు అమెరికా, జపాన్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లో కూడా ఈ సెంటర్ ఏర్పాటు కావడం దేశానికే గర్వకారణం. ఈ సెంటర్ ద్వారా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐబీఎం వంటి సంస్థ రాకతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.

ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం ఉన్న యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు పెరుగుతాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో ఒక కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద ఊపునిస్తుంది.

Exit mobile version