Site icon HashtagU Telugu

Ambati Rayudu: జనం నాడి తెలుసుకున్నా, రాజకీయాల్లోకి వస్తున్నా: అంబటి రాయుడు

Ambati Rayudu

Rayudu Politica Entry

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? ఆయన వైసీపీలో చేరుతున్నారా? టీడీపీ నుంచి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తారా? లాంటి ప్రశ్నలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో వెల్లడించారు. గ్రామీణుల సమస్యలు, అవసరాలు తెలుసుకొని, వాటిలో ఏ  పనులు చేయగలను, ఏ అవసరాలు తీర్చగలను అనే అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చాక  రాజకీయాల్లోకి వస్తానన్నారు. ప్రజాసేవకు వెళ్లే ముందు జనం నాడి  తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నానని వివరించారు.

అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. త్వరలోనే అంబటి రాయుడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో పాల్గొననున్నారు. ఇది ముగిసిన తర్వాత అంబటి రాయుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అంబటి రాయుడు పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం, ట్విటర్‌లో సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించడంతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెస్కే ప్రసాద్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఆ తరువాత ఎమ్మెస్కే సెలక్షన్ కమిటీలో ఏం జరిగిందీ.. అంబటి రాయుడు ఎంపిక పైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగానూ అంబటి రాయుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కడో ఒక ఐటీ బిల్డింగ్ కడితే అదే అభివృద్ధి కాదని పరోక్షంగా టీడీపీ చేసుకొనే ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతుగా ట్వీట్లు చేయడంతో ఆయన వైసీపీలోనే చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Also Read: Tholi Ekadashi: తొలి ఏకాదశి జరుపుకొను విధానం, నియమాలు ఇవే