Kodali Nani: కొడాలికి క్యాన్సర్.. అసత్య వార్తలను ఖండించిన వైసీపీ ఫైర్ బ్రాండ్!

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి క్యాన్సర్ అంటూ కొన్ని తప్పుడు వార్తలొచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Kodali Nani

Kodali Nani

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి క్యాన్సర్ అంటూ కొన్ని తప్పుడు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలు వైరల్ కావడంతో నాని స్పందించారు. తనకు క్యాన్సర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను దైర్యంగా ఎన్నికలలో ఎదుర్కోలేక, తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కథనాల ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఈ మేరకు ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. రెండు రోజులుగా తాను ఏయే కార్యక్రమాలలో పాల్గొన్నారో వివరంగా తెలియజేశారు.

1.కొడాలి నాని ఎటువంటి హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వలేదు

2. గత వారం రోజులుగా గుడివాడలోనే ఉంటు ప్రజల సమస్యలు వింటు వాటిని పరిష్కరించారు

3. ఆదివారం బాబ్జి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు

4. కొండలమ్మ వారికి ఆషాడ సారే అందించారు

5. కుటుంబ సభ్యులు విదేశాల నుండి వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకునే క్రమంలో నిన్న హైదరాబాద్ వెళ్ళారు

6. ప్రస్తుతం విజయవాడలో ఆయన వ్యక్తిగత కార్యక్రమంలో ఉన్నారు

7. మధ్యాహ్నం కి గుడివాడ వస్తారు, ఎప్పటిలానే ప్రజల సమస్యల పై అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు క్లారిటీ ఇచ్చారు.

ఉపయోగం లేని అబద్దపు వార్తలను నాని ఖండించారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, పదవుల కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే నానితో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాని ఆరోగ్యంగా ఉన్నట్టు ఓ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు.

Also Read: Telangana Waterfalls: ఉప్పొంగుతున్న తెలంగాణ జలపాతాలు, క్యూ కడుతున్న టూరిస్టులు!

  Last Updated: 11 Jul 2023, 02:58 PM IST