Site icon HashtagU Telugu

Avanthi Srinivas: నేను అవినీతి చేయ‌లేదు.. కుటుంబం కోస‌మే రాజీనామా చేశా: అవంతి

Avanthi Srinivas

Avanthi Srinivas

Avanti Comments: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ (Avanthi Srinivas) గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై పలు విమర్శలు చేశారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్‌ గౌరవించాలి. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఐదేళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్‌ను ఉద్దేశించి) ఆదేశాలిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు’’ అని అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

వైసీపీకి, పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. రాజకీయాలతో, కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కారణాల రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను.. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదని అన్నారు.

Also Read: NASA : రెడ్ ప్లానెట్‌పై ఇంజిన్యూటి హెలికాప్టర్ ప్రయాణం ముగిసింది

భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన అభివృద్ధి చేసిన ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయంలో నేనెలాంటి అవినీతి చేయ‌లేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. కూట‌మి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. వారి ఆరు నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే, కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలు అందరిని ఒకసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసమ‌ని జ‌గ‌న్‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

బ్రిటిష్ వారు నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయండి సమంజసం కాదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజం. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందింది. మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. ఎమ్మెల్యేలు కావొచ్చు.. సీఎంలు కావచ్చు ఎన్నికల ముందు ఒక కోరిక‌తో ఆ సీట్లోకి వ‌స్తారు. వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు.