Chandrababu : నాన్న ను అలా చూసి తట్టుకోలేకపోయా – నారా లోకేష్

Chandrababu : తాజాగా మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను సాధారణంగా ఏడవను. కానీ నాన్నను రాజమండ్రి జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Cbn Arrest Lokesh

Cbn Arrest Lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన సంఘటనగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu) నిలిచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఆరోపణలు మోపుతూ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని వాదించారు. అరెస్ట్ అనంతరం ఆయన్ను విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం రేపింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో రాజకీయ విద్వేషాలు స్పష్టంగా కనిపించాయని టీడీపీ వర్గాలు ఆరోపించాయి.

ఈ కేసు నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా అనేకమంది ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు గళమెత్తారు. ఆయన అరెస్ట్ పూర్తిగా రాజకీయ ప్రేరణతో జరిగిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో కేంద్ర రాజకీయాలలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా స్కిల్ డెవలప్‌మెంట్ పథకానికి ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రంలో నైపుణ్యవంతులైన యువత తయారవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి మంచి పనిని అవినీతి పేరుతో మలినం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది.

Hydraa : హైడ్రా అంటే కూల్చివేతలే కాదు అభివృద్ధి కూడా – కమిషనర్ రంగనాథ్

తాజాగా మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను సాధారణంగా ఏడవను. కానీ నాన్నను రాజమండ్రి జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడే ఆయన అభివృద్ధి చేసిన భవనంలో ఆయన్ను పెట్టారు. ఆయనకు జరిగినది పూర్తిగా అన్యాయం” అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది తమ కుటుంబానికి మానసికంగా చాలాబాధకు గురి చేసిందని వెల్లడించారు. చంద్రబాబు పట్ల జైల్లో కూడా అనేక అపార్థాలు సృష్టించబడ్డాయని అన్నారు.

ఇక 2024 సాధారణ ఎన్నికల అనంతరం తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆయనపై ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, ఆయనకి మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు నిలబడ్డారు. అరెస్ట్ చేసిన సమయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పోలీసు వ్యవహారం, న్యాయసమయంలో జరిగిన ఘటనలపై ఇంకా విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద మలుపునే తీసుకరావడమే కాదు వైసీపీ ఓటమికి తొలి మెట్టు పడింది.

  Last Updated: 20 Jul 2025, 05:50 PM IST