Prudhvi Raj: పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తా!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని సీనియర్ నటుడు పృధ్వీ రాజ్ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Prudvi Raj

Prudvi Raj

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని సీనియర్ నటుడు పృధ్వీ రాజ్ అన్నారు. నటుడు పృధ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జనసేనలో చేరబోతున్నానని, ఈరోజు నాగబాబును కలిశానని చెప్పారు. తాను వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడి పనిచేశానని, అయితే కోవిడ్‌-19తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడూ తనతో మాట్లాడలేదన్నారు. పృద్వీ రాజ్ గతంలో వైఎస్సార్‌సీపీ తరపున పనిచేసి తూర్పుగోదావరిలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. జగన్ తనను మోసం చేశాడు అని, నాయకుడు అంటే పవన్ కళ్యాన్ అని పృధ్వీ రాజ్ అన్నారు.

  Last Updated: 06 Aug 2022, 03:51 PM IST