Pawan Kalyan: నేను ఎన్డీయేతో ఉన్నా: పవన్ కళ్యాణ్ క్లారిటీ!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 12:27 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్డీఏకు మద్దతు ఇవ్వరని, టీడీపీకే జై కొడుతారని మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీంతో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)ని వీడేది లేదని సినీనటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) మద్దతిచ్చేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలిగినట్లు పవన్ కల్యాణ్ బహిరంగ సభలో చెప్పలేదని ఆ పార్టీ పేర్కొంది.

తాను ప్రస్తుతం ఏన్డీయే కూటమిలోనే ఉన్నననీ, కూటమి నుంచి బయటకు రాలేదని పవన్‌ పేర్కొన్నారు. ఒకవేళ వైదొలగే నిర్ణయం తీసుకుంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎన్డీయేలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం టీడీపీ బలహీనంగా ఉన్నందున జనసేన మద్దతు ఇస్తుందని ఆయన తన ప్రసంగంలో చెప్పారని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. జనసేన ఎన్డీయేలో భాగమేనని చెప్పిన సత్యనారాయణ, తాము కూడా టీడీపీతోనే ఉంటామని చెప్పారు.

కృష్ణా జిల్లా పెడనలో తన వారాహి యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కష్టకాలంలో టీడీపీకి అండగా నిలిచేందుకు వచ్చానని అన్నారు. జనసేన తాజా స్టేట్ మెంట్ తో వచ్చే ఎన్నికల్లో బీజేబీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.

Also Read: SHE Team: షీ టీమ్స్ నిఘా.. 488 మంది పోకిరీల పట్టివేత!