సినిమాల్లో విలన్లు ఎక్కువగా కనిపిస్తారు. చివరకు హీరో అందరి మీద గెలుస్తాడు. అలాగే దుష్ట చతుష్టయంపై అంతిమ గెలుపు తనదేనని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వేళ అభిప్రాయపడ్డారు.
‘తోడేళ్లంతా ఏకమవుతున్నారు? పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారు. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. అర్హత లేని వార ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్. వారిది డీబీటీ. అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో. సినిమాల్లో హీరోలే నచ్చుతారు. విలన్ లు కాదు. చివరకు మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని వ్యాఖ్యానించారు.
పేదరికం నుంచి బయటపడాలంటే విద్యతోనే సాధ్యమన్న జగన్ (Jagan) నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్న విషయాన్ని గర్తు చేశారు. జగనన్న ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యాదీవెన.. వసతి దీవెన కారణంగా పెద్ద ఎత్తున పిల్లలు చదువుకు దగ్గరయ్యారన్నారు. దేశంలో విద్యాదీవెన.. వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవన్న జగన్.. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదేనని వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి పిల్లలకు ఉండకూడదన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామని.. ఫీజులు మాత్రమే కాదు.. వసతి ఫీజులు కూడా చెల్లిస్తున్న విషయాన్ని చెప్పిన సీఎం జగన్ (Jagan) ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగందన్నారు. ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీ పడేలా చేస్తున్నట్లు చెప్పారు.
‘ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత.. ఆ పథకంలో భాగంగా నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రతి సందర్భంలోనూ బటన్ నొక్కటం అవసరమా? జగన్ (Jagan) ఫాలో అయ్యే పద్దతే కరెక్టు అయితే.. దేశంలోని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేసే ప్రతి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే సమయంలోనూ బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేపడితే.. బటన్ నొక్కటమే పెద్ద పనిగా మారుతుందేమో? అన్న సందేహం కలుగుతుంది.
తాజాగా తిరువురులో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.698.68 కోట్ల మొత్తాన్ని జమ చేసిన సందర్భంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎదురైన ఓటమిని నేరుగా ప్రస్తావించలేదు కానీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చేస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఆయన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తాజా ఫలితాలపై పరోక్షంగా ఆక్రోశం వెళ్ల గక్కారు. సినిమా హీరో లెక్కన 2024 ఎన్నికల్లో అంతిమ విజయం మనదే అంటూ క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: Chandra Babu Attraction: ఉత్తరాంధ్రలో ‘గంటా’ చిచ్చు! మళ్లీ బాబు చెంతకు..!!