Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్‌ వర్మ

తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.

Published By: HashtagU Telugu Desk
Ram Gopal Verma

Ram Gopal Verma

Ram Gopal Verma: తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా. అయితే దీనిపై ఆర్జీవీ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ తన ట్విట్టర్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ ట్వీట్ చేశారు ఆయన. ఆకస్మిక నిర్ణయం ఇది.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా అంటూ ఆర్జీవీ వెటకారంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ప్రకటన ఫన్నీగా ఉన్నప్పటికీ జనసేన వర్గాలను కెలికినట్టైంది. వర్మ వైసిపికి అనుకూలంగా వున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్జీవీ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా కౌంటర్ ఇచ్చాడంటుంటే…మరి కొందరు ఏ పార్టీ తరపునంటూ ప్రశ్నిస్తున్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు గురువారం పిఠాపురం నుండి పోటీ చేయాలనే నిర్ణయం ప్ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్న ఉత్కంఠకు తెరపడింది. కాగా 20019 అసెంబ్లీ ఎన్నికల్లో పాపవాన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో పవన్ ఓటమి చెందడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also Read: Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం

  Last Updated: 14 Mar 2024, 05:56 PM IST