Site icon HashtagU Telugu

Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది

Hyper Jansena 24

Hyper Jansena 24

గత మూడు రోజులుగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విపరీతమైన ట్రోల్స్ , ఆగ్రహపు జ్వాలలు , అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో (Janasena 24 Seats) పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి జనసేన శ్రేణుల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పదేళ్లు కష్టపడినా మాకు టికెట్ ఇవ్వరా అని కొంతమంది..ఇంకెన్ని ఎన్ని సార్లు పక్క పార్టీల జెండా పట్టుకోవాలని కార్యకర్తలు..ఇదే అదును చేసుకొని వైసీపీ నేతలు పావలా కళ్యాణ్ అమ్ముడు పోయాడని , చంద్రబాబు వేసి ముష్టి తీసుకున్నాడని ఇలా ఏది పడితే అది అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టడం..ఇలా మూడు రోజులుగా రాష్ట్రంలో ఇదే జరుగుతుంది.

మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేయడం, ఇంతకాలం మోసిన జెండాలను తగలబెట్టడం..మా దేవుడు అంటూ కొలిచిన పవన్ కళ్యాణ్ ను రాక్షసుడు అంటూ తిట్టడం ఇలా అన్ని చేస్తున్నారు. దేవుడు అని కొలిచిన వారే ఈరోజు ఆ దేవుడ్ని తిడుతుంటే సగటు అభిమాని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ప్రజలకా మీరు సేవ చేయాలనుకున్నది అంటూ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకయ్యా..మీకు ఈ రాజకీయాలు..హ్యాపీగా ఏసీ గదుల్లో ఉంటూ..రోజుకు కోట్లు సంపాదించకుండా పనికిరాని వాళ్ళతో మాటలు పడడం అంటూ అభిమానులు బాధపడుతున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే హైపర్ ఆది (Hyper Aadi Reacts)..జనసేన సైనికులకు , కార్యకర్తలకు , వీరమహిళలకు తన విన్నపాన్ని తెలియజేసాడు. జనసేనకి 24 సీట్లు అని ప్రకటించగానే.. చాలామంది పవన్ కళ్యాణ్‌ గారిని తిట్టడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది అలిగి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే.. భుజంపై మోసిన జెండాని కాలుతో తొక్కి కాలుస్తున్నారు. ఇంకొంతమంది జనసేన స్టిక్కర్స్‌ని తొలగిస్తున్నారు. పార్టీని అభిమానించేవాళ్లే ఇంత ఆలోచిస్తుంటే, పార్టీని స్థాపించిన వాడు, పార్టీని ప‌దేళ్లుగా న‌డుపుతున్న‌వాడూ ఇంకెంత ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకొని ఉంటాడో ఒక్క‌సారి ఆలోచించండి అంటూ జ‌న‌సైనికుల‌కు హిత‌వు ప‌లికాడు. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తను నమ్ముకున్న ప్రజల్ని కానీ.. తన వెంట నడుస్తున్న ప్రజల్ని మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌గారికి ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే.. పార్టీ పెట్టిన వ్యక్తి ఎంత ఆలోచిస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన తనలో తాను ఎంత మదనపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. పదేళ్లుగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా.. తన కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది.

2019లో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది ప్రశ్నించాడు. సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని కొనియాడాడు. రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసకునే పవన్… సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి… ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారని చెప్పాడు. చిన్న పరీక్షలో ఫెయిల్ అయతేనే మనం పది రోజులు బయటకు రాలేమని… అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు.

కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని… ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని… అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం… అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని అన్నాడు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అడంబరాలను కోరుకోరు. పొత్తుని కూడా చాలా సింపుల్‌గా ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని నిజాయితీగా పాటించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకుని ఇన్నే గెలిచాడు అని అనిపించుకునే కంటే.. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలిచాడు అనిపించుకోవడం మంచిదని.. 24 సీట్లు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని గౌరవించాలి. మరీ 24 సీట్లేనా? అని విమర్శించే వారికి నేను చెప్పేది ఏంటంటే.. మహేంద్ర సింగ్ ధోని వచ్చిన కొత్తలో డకౌట్ అయ్యాడు. ఆ తరువాత మెల్ల మెల్లగా గేమ్ ఛేంజర్ అయ్యాడు.. ఆ తరువాత గేమ్ విన్నర్ అయ్యాడు.. ఆ తరువాత క్రికెట్‌నే శాసించే వాడయ్యాడు. మన నాయకుడు కూడా అంతే. స్టార్టింగ్ రెండు చోట్లా ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 24 సీట్లు గెలవొచ్చు.. మూడు పార్లమెంట్ సీట్లూ గెలవొచ్చు. ముందు ముందు ఆయనే గేమ్ ఛేంజర్ అవ్వొచ్చు.. గేమ్ విన్నర్ అవ్వొచ్చు.. ఆయనే రాజకీయాలను శాసించొచ్చు. ఎప్పుడూ ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. జనసేన పార్టీని పోటీ చేసిన 24 సీట్లు గెలిపించడానికి కష్టపడండి. పదేళ్లుగా పార్టీని నడుపుతున్న వ్యక్తికి పది సీట్లు తగ్గగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే నాకు మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.. జై జనసేన’ అంటూ హైపర్ ఆది ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ మాటలకు జనసేన శ్రేణులు , అభిమానులు ఆలోచనలో పడ్డారు. నిజమే కదా..ఆది చెప్పింది..ఎందుకు మనం తొందర పడ్డం..తొందర పడుతున్నాం..ఇది కాదు కదా మనం. ఇలా ఎలా ఆలోచిస్తున్నాం..మన దేవుడ్ని గెలిపించుకోవడమే మన ద్యేయం కదా..శత్రువుల్లాగా మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం అంటూ ఒక్కసారిగా అంత ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనప్పటికి నిజమైన అభిమాని , కార్యకర్త తమ అధినేత మాటకు కట్టుబడి ఉండాలి తప్పితే ఏదో ఆశించి తప్పు చేయకూడదు. చూద్దాం ఈరోజు నుండి ఏం జరుగుతుందో..

Read Also : Nani: నానికి బర్త్డే గిఫ్ట్ గా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు అర్జున్.. వీడియో వైరల్?