Site icon HashtagU Telugu

Janasena : పిఠాపురం రోడ్ షోలో జగన్ ఫై పంచ్ ల వర్షం కురిపించిన హైపర్ ఆది

Hyper Aadi Anp

Hyper Aadi Anp

జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది (Hyper Aadi) కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సభ ఏదైనా , వేదిక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. ఆ అభిమానమే..మెగా అభిమానుల్లో హైపర్ ఆది కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా చేసింది. అంతే కాదు జనసేన కోసం అది ప్రచారం (Election Campaign) చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మండుఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని ,కూటమి ని గెలిపించాలని కోరుతూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా నాగబాబుతో కలిసి పిఠాపురం లో రోడ్ షో నిర్వహించారు. ఈ షో లో జగన్ ఫై పంచ్‌ల వర్షం కురిపించారు. ఈ పంచ్ లకు ఓటర్లతో పాటు రోడ్ షోలో ఉన్న నేతలు నవ్వుల వర్షం కురిపించారు. కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి ప్రభుత్వాన్ని దూరంగా పెట్టాలన్నా ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నాడు. పవన్‌కు ఓటు వేసే అదృష్టం తనకు లేదన్నాడు హైపర్ ఆది. మంచి జరిగితే ఓటు వేయాలని వైసీపీ సర్కార్ ప్రతి సభల్లోనూ చెబుతోందని, వాళ్లింట్లోనే మంచి జరగక ఇద్దరు చెల్లెళ్లు రోడ్లపై తిరుగుతున్నారని తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు. బటన్ నొక్కితే ఆడవాళ్లు అకౌంట్లో 10వేలు పడుతున్నాయని చెబుతున్నారని, సాయంత్రం మూత ఓపెన్ చేస్తే మగవాళ్ల అకౌంట్ నుంచి 30 వేలు పోతున్నాయని పేర్కొన్నాడు. ఇక అది డైలాగ్స్ కు అక్కడికి వచ్చిన జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

Read Also : ATM Fraud: ఏటీఎం కార్డ్ ట్రాప్ స్కామ్ అంటే ఏమిటి? సైబ‌ర్ మోస‌గాళ్ల కొత్త రూట్ ఇదే..!