Andhra Pradesh: అమానుషం : భార్యకు గుండు కొట్టించిన భర్త..

భార్య విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేసిన భర్త ఆమెను కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండపూడి గ్రామంలో వెలుగు చూసింది.

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: భార్య విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేసిన భర్త ఆమెను కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండపూడి గ్రామంలో వెలుగు చూసింది.

సీతానగరం స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్రి అభిరామ్‌, ఆశ హైదరాబాద్‌లో జూనియర్‌ సినీ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత అభిరామ్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. అనంతరం ఆశ తన భర్తపై సీతానగరం పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టి హైదరాబాద్ వెళ్లిపోయింది.

ఇటీవల ఆమె తనతో కలిసి జీవించాలని కోరుతూ తిరిగి వచ్చింది. వివాహేతర సంబంధాల విషయంలో అభిరామ్, ఆశల మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఆవేశంతో అభిరామ్ ఆశను కొట్టి, తర్వాత గుండు గీయించాడు. ఈ విషయాన్నీ బాధితురాలు ఆశ సెల్ఫీ వీడియో ద్వారా బయట పెట్టింది. వాళ్ళకి నాలుగేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అభిరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ తెలిపారు. అతనిపై సెక్షన్‌లు 324 , 354 , 506 మరియు 342 (కింద కేసు నమోదు చేశారు.

Also Read: Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..

  Last Updated: 03 Feb 2024, 04:04 PM IST