Site icon HashtagU Telugu

Nellore : భార్య ముందే ప్రియురాలి కోసం భర్త ఆత్మహత్యాయత్నం!

Nellore

Nellore

నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. భార్య ముందే ప్రియురాలి కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఓ యువకుడు. ప్రియురాలిని తన ఊరికి తెచ్చుకున్నాక, ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో తట్టుకోలేక ఈ ఘోరం చేశాడు. చివరికి భార్య అతన్ని కాపాడింది. నెల్లూరు జిల్లా కలిగిరిలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ప్రియురాలి కోసం భార్య ముందు ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు.. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. వివాహమై ఒక కూతురు ఉన్న వ్యక్తి, వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ, ఆమెను తన ఊరికి తీసుకువచ్చాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి తీసుకెళ్లడంతో.. ఆ వ్యక్తి ఆమెను తన నుంచి దూరం చేయవద్దని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ మొత్తం సంఘటనను చూస్తున్న అతని భార్య, చివరికి అతన్ని ఆసుపత్రిలో చేర్పించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కలిగిరిలో ఈ ఘటన జరిగింది.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఏపినాపికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా.. ఓ కూతురు ఉంది. విష్ణు ఉపాధి కోసం మూడేళ్ల క్రితం ఇటుక బట్టీల్లో పనికి చేరాడు.. అక్కడే భార్యతో కలిసి ఉంటున్నాడు. అనకాపల్లిలో ధనలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.. వారిద్దరు (విష్ణు, ధనలక్ష్మి) సన్నిహితంగా ఉంటున్నారు. విష్ణు భార్య సరితకు ఈ విషయం తెలిసి ఆమె సొంత ఊరికి నెల్లూరు జిల్లా ఏపినాపికి వచ్చేసింది.. అత్తమామలతో కలిసి ఉంటుంది. విష్ణు తన ప్రియురాలు ధనలక్ష్మిని ఏకంగా సొంత ఊరు ఏపినాపికి తీసుకొచ్చాడు. అయితే ఈ నెల 16న ధనలక్ష్మి తల్లిదండ్రులు అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది.

విష్ణు, ధనలక్ష్మి ప్రకాశం జిల్లా పామూరులోని ఓ లాడ్జిలో ఉంటున్నట్లు సరితకు తెలిసింది.. ఆమె పోలీసుల సాయంతో వారిద్దర్ని తీసుకుని కలిగిరి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ ఆస్తి తనకు వద్దని విష్ణు సంతకం చేశాడు.. భార్యకు పత్రాలు అందజేశాడు. ఇంతలో అనకాపల్లి పోలీసులకు ధనలక్ష్మి ఎక్కడుందో తెలిసిపోయింది.. దీంతో వారు ఆమె తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని కలిగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ తర్వాత ధనలక్ష్మి తీసుకుని వెళ్లిపోవడంతో.. విష్ణు మనస్తాపంతో ఎదురుగా ఉన్న షాపులోకి వెళ్లి పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసి రోడ్డుపైనే అందరిముందు తాగేశాడు. వెంటనే భార్య సరిత గమనించి బంధువుల సాయంతో ఆటోలో అతడ్ని ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్ అయ్యింది.

Exit mobile version