Human Trafficking : ఏపీకి `వ్య‌భిచారం`ట్యాగ్

వ‌త‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆక‌ట్టుకుంటున్నారు. ఆయ‌న చెప్పే డైలాగుల‌తో (Human Trafficking) యువ‌త ఊగిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 02:42 PM IST

ప‌దేళ్ల క్రితం పార్టీ పెట్టిన ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని లైవ్ లో ఉంచుతున్నారు. యువ‌త‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆక‌ట్టుకుంటున్నారు. ఆయ‌న చెప్పే డైలాగుల‌తో (Human Trafficking) యువ‌త ఊగిపోతున్నారు. ఏపీ భ‌విష్య‌త్ గురించి ఆలోచించాల‌ని మాట్లాడుతున్నారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, వాలంటీర్లు హ్యూమ‌న్ ట్రాఫికింగ్ (వ్య‌భిచారం)కు పాల్ప‌డుతున్నార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయడం ఏపీ రాజ‌కీయాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది.

వాలంటీర్లు హ్యూమ‌న్ ట్రాఫికింగ్ (వ్య‌భిచారం)కు పాల్ప‌డుతున్నార‌ని (Human Trafficking)

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. వాళ్ల ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంటి వ‌ద్ద‌కు సేవ‌ల‌ను అందించ‌డానికి అనుసంధాన క‌ర్త‌లుగా వాళ్ల‌ను వాడుకుంటున్నారు. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక వాలంటీర్ ను నియ‌మించ‌డం ద్వారా సంక్షేమ ప‌థ‌కాల‌ను డోర్ డెల‌వ‌రీ చేస్తున్నారు. అంతేకాదు, ఆ కుటుంబాల మీద ప‌ట్టు ఉండేలా డైరెక్ష‌న్ ఇచ్చారు. వాళ్ల‌తో పాటు తాజాగా గృహ సార‌థుల‌ను ప్ర‌తి 50 మంది ఓటర్ల‌కు ఒక‌ర్ని నియ‌మించారు. అటు వాలంటీర్లు ఇటు గృహ‌సార‌థులు పౌరుల ప్రైవేటు జీవితాల్లోకి.( Human Trafficking)తొంగిచూస్తున్నార‌ని ప‌వ‌న్ అనుమానం.

యువ‌త‌ల ప్రేమ వ్యవ‌హారాలు, ఒంట‌రి మ‌హిళ‌ల జీవితాల‌ను

ఏపీలోని యువ‌త‌ల ప్రేమ వ్యవ‌హారాలు, ఒంట‌రి మ‌హిళ‌ల జీవితాల‌ను అసాంఘిక శ‌క్తుల‌కు వాలంటీర్లు  ( Human Trafficking) చేర‌వేస్తున్నార‌ని ప‌వ‌న్ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప్ర‌తి కుటుంబంలోని స‌భ్యుల బ‌ల‌హీన‌త‌ల‌ను అసాంఘిక శ‌క్తుల‌కు చేర‌వేయ‌డం ద్వారా హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న అనుమానం. అంతేకాదు, ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక వైసీపీ పెద్ద‌లు ఉన్నార‌ని చెబుతున్నారు. ఆ విష‌యాన్ని కేంద్ర నిఘా సంస్థ‌ల అధికారులు చెప్పిన‌ట్టు ప‌వ‌న్ చెబుతున్నారు. ఆయ‌న చేసిన కామెంట్ల‌కు ప్ర‌తిగా వాలంటీర్ల వ్య‌వ‌స్థ రియాక్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ దిష్టిబొమ్మ‌ల‌ను త‌గుల‌పెడుతూ నిర‌స‌న‌కు దిగారు.

వాలంట‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్ల చేయ‌డం రాజ‌కీయ వేడి

ఏలూరు వేదిక‌గా ప‌వ‌న్ చేసిన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కామెంట్ల‌ను మ‌హిళా సంఘాలు కూడా సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ కు ఫిర్యాదు అందాయ‌ని తెలుస్తోంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కు కూడా కొంద‌రు ఏపీలోని మ‌హిళ‌లు ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌ను చేర‌వేశారు. రాజ‌కీయాల‌ను ఏపీలోని ఒంట‌రి మహిళ‌ల వ్య‌భిచారం  ( Human Trafficking) వ‌ర‌కు తీసుకెళ్లిన ప‌వ‌న్ వాల‌కంపై దుమారం రేగుతోంది. వార‌హి యాత్ర‌ను ప్రారంభించిన తొలి రోజుల్లో హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. సుఫారీ కుదుర్చుకున్నార‌ని, మెగా కుటుంబాన్ని రాజ‌కీయాల్లోకి రాక‌ముందే హ‌తం చేయాల‌ని చూశార‌ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏపీలోని యువ‌త‌ల ప్రేమ‌, ఒంట‌రి మ‌హిళ‌ల వ్య‌భిచారం గురించి మాట్లాడుతున్నారు. వాలంట‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్ల చేయ‌డం రాజ‌కీయ వేడిని పెంచింది.

Also Read : Janasena fever : డిప్ర‌ష‌న్లో ప‌వ‌న్ ? సోష‌ల్ మీడియాలో YCP దుమారం!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ వేదిక‌గా ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌పై రియాక్ట్ అయ్యారు. జ‌న‌సేనానిని ప‌వ‌న్ ( Human Trafficking) మీద క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేసు న‌మోదు చేసి ప‌వ‌న్ ను విచార‌ణ చేయాల‌ని వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేస్తున్నారు. వైసీపీ లీడ‌ర్ల‌ను బూతులు తిడుతూ గ‌తంలోనూ ప‌వ‌న్ నోరు జారారు. చెప్పులు చూపిస్తూ నానా తిట్లు తిడుతూ మీడియా ఎదుట ఊగిపోయారు. ఇప్పుడు వారాహి వాహ‌నంపై నుంచి ప్ర‌తిరోజూ ఏదో ఒక విధంగా వైసీపీ లీడ‌ర్ల భాగోతాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. దీంతో ప‌వ‌న్ ప్రైవేటు, వ్య‌క్తిగ‌త జీవితంలోకి వైసీపీ తొంగిచూసింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప్రైవేటు, వ్య‌క్తిగ‌త జీవితంను ప్ర‌స్తావిస్తూ ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఫ‌లితంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య దిగ‌జారుడు రాజ‌కీయం న‌డుస్తోంది.

Also Read : Pawan Kalyan – Anna Lezhneva : బయటకు వచ్చిన పవన్ భార్య.. రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారుగా..