Chandrababu : చంద్ర‌బాబు రోడ్ షోకు కిక్కిరిసిన జ‌నం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు మూడు రోజుల అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌ ప‌ర్య‌ట‌న ఉత్త‌రాంధ్ర టీడీపీ క్యాడ‌ర్ కు మ‌ర‌చిపోలేని అనుభూతిని మిగిలించింది.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 02:37 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు మూడు రోజుల అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌ ప‌ర్య‌ట‌న ఉత్త‌రాంధ్ర టీడీపీ క్యాడ‌ర్ కు మ‌ర‌చిపోలేని అనుభూతిని మిగిలించింది. ఒంగోలు మహానాడును మించిన జ‌నం త‌ర‌లిరావ‌డం గ‌మ‌నార్హం. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం చంద్ర‌బాబు స‌భ‌కు రావ‌డం ఇటీవ‌ల బ‌హుశా ఎక్క‌డా చూడ‌లేదు. కానీ, చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర మినీమ‌హానాడు స‌భ‌లు అనూహ్య హిట్ కావ‌డం ఆ పార్టీ క్యాడ‌ర్ లో నూత‌నోత్సాహాన్ని నింపింది.

ఒంగోలు మ‌హానాడుకు ముందుగా విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా వ‌చ్చిన జ‌నాన్ని చూసి ఉత్త‌రాంధ్ర టీడీపీదే అంటూ క్యాడ‌ర్ భావించింది. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ కావ‌డంతో పొత్తులేకుండా అధికారంలోకి రావ‌చ్చ‌నే ధీమాకు టీడీపీ వ‌చ్చేసింది. అదే టెంపోను కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌తి వారం మూడు రోజుల జిల్లాల టూర్ పెట్టుకున్నారు. ఆ క్ర‌మంలో గురువారం అన‌కాప‌ల్లి వెళ్లిన చంద్ర‌బాబు తొలి రోజు అక్క‌డ స‌భ‌ను నిర్వహించారు. రెండో రోజు అక్క‌డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా లీడ‌ర్ల‌తో స‌మీక్షించారు. గ్రూప్ ల‌ను స‌రిచేసే ప్ర‌య‌త్నం చేశారు. మూడో రోజు రోడ్ షో ను చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టారు.

తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఈసారి మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆ విష‌యం చంద్ర‌బాబు రోడ్ షోల‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసి ఆ పార్టీ విశ్వ‌సిస్తోంది. పైగా చంద్ర‌బాబు స్పీచ్ కు వ‌చ్చిన స్పంద‌న చూసిన త‌రువాత ఆ పార్టీ సంబ‌ర‌ప‌డుతోంది. పొత్తుల్లేకుండా ఒంట‌రిగా వెళ్లిన‌ప్ప‌టికీ అధికారంలోకి రావ‌చ్చ‌నే ధీమాతో ఉంది. మొత్తం మీద ఉత్త‌రాంధ్ర మీద చంద్ర‌బాబు వేసిన స్కెచ్ ఫ‌లిస్తున్న‌ట్టు చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర రోడ్ షోల ద్వారా అర్థం అవుతోంది.