Ration Storage : పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం – మంత్రి నాదెండ్ల మనోహర్

పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు

Published By: HashtagU Telugu Desk
Manohar Inspected

Manohar Inspected

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..24 మంది మంత్రులు తమ శాఖలకు సంబదించిన బాధ్యతలు మొదలుపెట్టారు. బాధ్యత చేపట్టడమే ఆలస్యం..తమ పనిలో బిజీ అయ్యారు. ఐదేళ్ల వైసీపీ పాలనా లో జరిగిన అక్రమాలు , అవకతవకలు , కుంభకోణాలను బయటకు తీస్తూ ప్రజలను అసలు నిజాలు బయటపెట్టే పనిలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Manohar) వెల్లడించారు. రాష్ట్రంలోని పలు చోట్ల తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున కుంభ కోణాలు జరిగినట్లు బయటపడ్డాయి. నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు , రేషన్​లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్‌కు 50-100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుంది. ఒక్క తెనాలిలోనే ఇలా ఉందా? మిగిలినచోట్ల కూడా ఇలాగే ఉంటుందా? అని మంత్రి అధికారుల్ని ప్రశ్నిస్తే వారినుంచి సరైన సమాధానం రాలేదు. అలాగే రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్‌ నుంచి అంగన్‌వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరిగినట్లు తేలింది. ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. అవన్నీ బయటకు రావాలని అధికారులను హెచ్చరించారు.

Read Also : Free Bus Travel Scheme : జులై 1 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ?

  Last Updated: 16 Jun 2024, 01:01 PM IST